Begin typing your search above and press return to search.

మాస్క్ పెట్టుకోని మాజీ మేయర్..రూ.1000 ఫైన్ వేసిన పోలీసులు !

By:  Tupaki Desk   |   11 May 2021 12:08 PM GMT
మాస్క్ పెట్టుకోని  మాజీ మేయర్..రూ.1000 ఫైన్ వేసిన పోలీసులు !
X
కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ప్రజలందరూ మాస్క్ పెట్టుకోవడం అనేది అలవాటుగా మార్చుకోవాలని చెప్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ పెట్టుకోవడంపై అవగాహన కల్పించడంతో పాటు మాస్క్ పెట్టుకోకపోతే రూ. 1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే మాస్క్ పెట్టుకోని సామాన్యులతో పాటుగా ,ప్రజా ప్రతినిధులకు కూడా జరిమానాలు విధిస్తు వస్తున్నారు పోలీసులు. ప్రతిరోజూ అలాంటి వారికి ఫైన్‌లు వేస్తూనే ఉన్నారు.

తాజాగా మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చిన హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి పోలీసులు జరిమానా విధించారు. తనిఖీలు చేస్తూ మాస్క్ లేని వారికి జరిమానాలు విధిస్తున్న తెలంగాణ పోలీసులు.. మాస్క్ లేకుండా కారులో ప్రయాణం చేస్తున్న తీగల కృష్ణారెడ్డికి రూ. 1000 జరిమానా విధించారు. ఈ క్రమంలో మాజీ మేయర్‌ కు, పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని సరూర్‌ నగర్‌ సబ్ ఇన్‌స్పెక్టర్ ముకేష్, మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. కారులో వెళ్తున్నా మాస్కు ధరించాలా, అంటూ ఆయన ఎస్‌ ఐతో గొడవకు దిగారు. ఈ క్రమంలో సబ్‌ ఇన్‌ స్పెక్టర్ ముకేశ్‌ కు తీగల కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. మాకు అంతా సమానులే అంటూ పోలీసులు తీగలకు ఎట్టకేలకు 1000 రూపాయల చలానా విధించారు.అయితే అంతా నిబంధనలు పాటించాల్సిందే అని.. ఈ విషయంలో తమకు అంతా సమానమే అని పోలీసులు రూ.1000 ఫైన్ విధించారు.