Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి ఆలపాటి రాజా అరెస్ట్..!

By:  Tupaki Desk   |   9 Jan 2020 7:24 AM GMT
మాజీ మంత్రి  ఆలపాటి రాజా అరెస్ట్..!
X
ఏపీ రాజధాని అమరావతి నే అంటూ ఏపీలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులు 23 వ రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కానీ , ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. రాజధాని ఆందోళనల నేపధ్యంలో రాజధాని అమరావతిలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజాగా అమరావతిలో మరింత ఉద్రికత్త పరిస్థితి ఏర్పడింది.

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయన రైతుల తో కలిసి గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి పాదయాత్ర గా బయల్దేరగా, నందివెలుగు సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మరోవైపు ఆలపాటి పాదయాత్ర నేపథ్యంలో పలువురు టీడీపీ ముఖ్య నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు.

మరోవైపు ఆలపాటి పాదయాత్ర నేపథ్యం లో పలువురు టీడీపీ ముఖ్య నేతలను నిర్బంధించారని ,అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరని టీడీపీ నేతలు ప్రభుత్వం పై మండిపడుతున్నారు. రాజధాని అమరావతిని తరలించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అమరావతి రైతుల ఆవేదన ప్రభుత్వానికి పట్టటం లేదని అంటున్నారు. టీడీపీ నేతల అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లను ఆలపాటి తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు.