Begin typing your search above and press return to search.
ఏపీ బీయారెస్ ఇంచార్జిగా మాజీ మంత్రి....సంక్రాంతి తరువాతనే అంతా...?
By: Tupaki Desk | 8 Oct 2022 1:30 PM GMTఏపీలో బీయారెస్ ని విస్తరించాలని కేసీయార్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. దాని కోసం ఆయన ఆపరేషన్ ఆంధ్రాను అమలు చేస్తున్నారు. బీజేపీ పద్ధతిని కూడా ఫాలో అవుతున్నారు. కులం మతం కార్డులకు లొంగను వారు ఉండరు, ప్రాంతం సెంటిమెంట్ తో తెలంగాణాను కొట్టిన కేసీయార్ ఏపీలో కులాల కుంపటిని మరింతగా రగిలించబోతున్నారు అని అంటున్నారు.
దాంతో ప్రాంతాల సెంటిమెంట్ గాలికి కొట్టుకుపోయి కులం ముందుకు వస్తుంది అలా పెద్ద గీత గీసి తన రాజకీయ కార్యాన్ని ఆయన ఏపీలో నెరవేర్చుకోవాలని చూస్తున్నారు అని చెబుతున్నారు. దీని కోసం ఆయన ఏకంగా రెండు బడా రాజకీయ కుటుంబాలనే టార్గెట్ చేశారు అని అంటున్నారు. ఆ రెండు కుటుంబాలు రెండు ప్రాంతీయ పార్టీలలో కుదురుకుని ఉన్నాయి. టీడీపీతో తమ రాజకీయ జీవితాన్ని మొదలెట్టి పండించుకున్న ఫ్యామిలీ కింజరాపు వారిది. ఎర్రన్నాయుడు నుంచి తీసుకుంటే అచ్చెన్నాయుడు ఇపుడు టీడీపీలో టాప్ లో ఉన్నారు. ఇక ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు కూడా యువ నేతగా సత్తా చాటుతున్నారు.
ఈ కుటుంబం నుంచి ఎర్రన్న కుమార్తె కూడా జగన్ వేవ్ లో సైతం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా ఎర్రన్న ఫ్యామిలీ మీద కేసీయార్ కన్నేశారు అని అంటున్నారు. తన సొంత సామాజికవర్గానికి చెందిన వారు కావడమే ఇందుకు కారణం అని అంటున్నారు. ఎర్రన్న ఫ్యామిలీ టీడీపీలో బాగనే ఉన్నా రేపటి ఎన్నికల్లో తేడా కొట్టి టీడీపీ గెలవదు అన్న ఆలోచనలు ఏర్పడితే మాత్రం వారి రాజకీయం కోసం కొత్త పార్టీ వైపు చూడక తప్పదు అంటున్నారు. దాంతోనే కేసీయార్ తెలివిగా ఆ ఫ్యామిలీని దువ్వే పనిలో పడ్డారని అంటున్నారు.
అదే విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలోని మరో పెద్ద రాజకీయ కుటుంబం గా ధర్మాన ఫ్యామిలీ ఉంది. ఈ కుటుంబం వైసీపీలో ఉన్నా కూడా జగన్ వారికి పెద్దగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంలేదు అన్న బాధ ఉందిట. దాంతో ప్రసాదరావు మంత్రిగా ఉన్నా కూడా ఏదో చోట తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వస్తున్నారు అని అంటున్నారు. ఇక క్రిష్ణదాస్ కూడా కీలకంగా ఉన్న నేత. వీరిని మచ్చిక చేసుకుంటే బీయారెస్ ఏపీలో బలంగా జెండా పాతగలదని కూడా కేసీయార్ ప్లాన్ బీని రెడీ చేసి పెట్టుకున్నారని అంటున్నారు.
ఇక ఉత్తరాంధ్రాలో వెలమ సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉంది. దాంతో ఈ మూడు జిల్లాల్లో బీయారెస్ జెండా పాతాలీ అంటే ఈ రెండు కుటుంబాలనే దువ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోది. ఇదిలా ఉంటే కొత్త ఏడాది సంక్రాంతి తరువాత కేసీయార్ ఏపీ టూర్ ఉంటుంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రా, కొస్తా, రాయలసీమలలో వరసగా మూడు భారీ సభలను పెట్టడం ద్వారా ఏపీలో బీయారెస్ కి గట్టి పునాది వేయాలని కేసీయార్ చూస్తున్నారు అని అంటున్నారు.
ఈ లోగా పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడానికి ఏపీలో బీయారెస్ లో చేరికలకు దారులు చూపించే వారిని కొందరు బడా నాయకులను పార్టీలోకి తీసుకోవాలని చూస్తున్నారుట. ఇక కోస్తా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రికి బీయారెస్ పగ్గాలు అప్పగిస్తారు అని తెలుస్తోంది. ఆ మాజీ మంత్రి గతంలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. మరి ఆయన కాంగ్రెస్ కి చెందిన నేత కావచ్చు అని చెబుతున్నారు. చూడాలి మరి ఏపీ మీద కేసీయార్ వ్యూహాలు ఎలా పారుతాయో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.