Begin typing your search above and press return to search.
ఆ తిట్టుకు అర్థం చెప్పి అభాసు పాలవుతున్నారే..
By: Tupaki Desk | 26 Oct 2021 5:25 AM GMTమంచిని మంచి అని చెప్పుకోవాలి. చెడును చెడుగా చెప్పుకోవాలి. అంతేకానీ.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే.. అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు. ఈ చిన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు. తమ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి నోటి నుంచి వచ్చిన ‘బోసిడికే’కు ఎక్కడెక్కడి అర్థాలు చెప్పి తప్పించుకునే ప్రక్రియ జనాల చేత మరిన్ని మాటలు అనిపించుకునేలా ఉన్నాయే తప్పించి.. అతికినట్లుగా లేదన్న మాట వినిపిస్తోంది.
తిట్టిన మాట వాస్తవం. దాని అర్థం పట్టాభికి తెలుసా? లేదా? అన్నది ముఖ్యం. ఒకవేళ తెలిసి అన్నా.. తెలియక అన్నా తప్పు తప్పే కాబట్టి.. దాన్ని కవర్ చేయటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. దానికి బదులుగా.. అలాంటి భాషను వాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ కల్చర్ ఎవరు తీసుకొచ్చారు? లాంటి వాటిని ప్రస్తావిస్తూ మీడియాతో మాట్లాడినా బాగుంటుంది. కానీ.. ఆ తెలివి కూడా తెలుగు తమ్ముళ్లలో మిస్ అవుతోంది.
పట్టాబి తిట్టిన బోసిడీకే మాటకు అర్థాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పటం.. అలాంటి మాటను ముఖ్యమంత్రిని పట్టుకొని అంటారా? అంటూ ఆవేదన స్వరంతో చేసిన వ్యాఖ్య తెలుగు తమ్ముళ్లలో పలువురు ఆత్మరక్షణలో పడినట్లుగా చెబుతున్నారు. దీంతో.. దాన్ని కవర్ చేసుకోవటానికి కొత్త వాదనల్ని తీసుకొస్తూ.. ప్రజలకు మరింత మంట పుట్టేలా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. బోసిడీకే మాటకు వైపీపీ రెబల్ ఎంపీ రఘురామ సంబంధం లేని అర్థాన్ని గూగుల్ లో శోధించి.. బాగున్నారా? అని అర్థంగా చెబితే.. మరికొందరు ఒక ఊరి పేరు అని.. మరొకరు ఇంకొక మాట చెప్పిన వైనం తెలిసిందే.
తాజాగా విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ బూతుకు పాడైపోయిన అని అర్థమని.. తెలంగాణ పదకోశంలో బోడిడికె అంటే పాడైపోయిన అనే మాట వస్తుందని చెప్పారు. ఇలాంటి ఎక్కడెక్కడి అర్థాల్ని చెప్పటం ద్వారా అయ్యన్న లాంటి సీనియర్లు.. తమ స్థాయిని తగ్గించుకునే కన్నా.. మౌనంగా ఉంటే మరింత బాగుండేది కదా? అందుకు భిన్నంగా స్పందించి మరీ తిట్టించుకోవటంలో అర్థం లేదు. అంతేకాదు.. పట్టాభి అన్నది సీఎం జగన్ ను కాదని.. ఆయన పక్కనుండే సజ్జల రామక్రిష్ణారెడ్డినని చెప్పటం సరికాదు. అనుచిత వ్యాఖ్యను ముఖ్యమంత్రినే కాదు.. ఎవరిని అనకూడదన్న చిన్న విషయం అయ్యన్న లాంటి సీనియర్ నేతకు తెలియకపోవటమేమిటి?