Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు జైలు నుంచి అఖిలప్రియ విడుదల
By: Tupaki Desk | 23 Jan 2021 5:31 PM GMTసీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన భూమా అఖిలప్రియ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైంది. నిన్ననే ఆమెకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఫార్మాలటీస్ పూర్తి కావడానికి ఆలస్యం కావడంతో నిన్న విడుదల కాలేదు. ఈరోజు చంచల్ గూడ జైలు నుంచి అఖిలప్రియ విడుదలయ్యారు.
అఖిలప్రియ విడుదల సందర్భంగా చంచల్ గూడ జైలు వద్ద కోలాహలం కనిపించింది.. ఆమె బంధువులు, ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి అనుచరులు భారీగా తరలివచ్చారు. దీంతో జైలు వద్ద సందడి నెలకొంది.బెయిల్ పై విడుదలైన అఖిలప్రియకు పలు షరతులను కోర్టు విధించింది. 15 రోజులకు ఒకసారి బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
హఫీజ్ పేటలోని 50 ఎకరాల భూమి గురించి వివాదం నెలకొనగా ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేసిన ఈ ఘటన సంచలనమైంది. ఈ కేసులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, ఇతడి సోదరుడు, ఏవీ సుబ్బారెడ్డిలు ప్రధాన పాత్రదారులుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయబడ్డారు. ఈ కేసులో అఖిలప్రియను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.