Begin typing your search above and press return to search.
కాపులకు సీఎం పీఠం కోసం పెద్దాయన ఆపసోపాలు....?
By: Tupaki Desk | 17 Sep 2021 3:30 AM GMTఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. 1970 టైమ్ లోనే ఎమ్మెల్యేగా గెలిచిన నేత. ఆయనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య. ఆయనకు కాపు నాయకుడు అనిపించుకోవడం ఇష్టం. రాజకీయాల్లో కాపులు ఎంత ప్రభావిత వర్గంగా ఉన్నా కూడా అన్ని కులాలు కలిస్తేనే గెలుపు సాధ్యపడుతుంది. ఇది రాజకీయం చెప్పిన సత్యం. ఇదిలా ఉంటే హరిరామ జోగయ్య చాలా పార్టీలు మారారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ టీడీపీ నుంచి కాంగ్రెస్, అలాగే ప్రజారాజ్యం, వైసీపీ ఇలా చాలా తిరిగేశారు. ఇక ఇపుడు జనసేన వైపు ఆయన మొగ్గు చూపిస్తున్నారు. ఈ మధ్యలో ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కూడా పనిచేశారు. కాపులకు ముఖ్యమంత్రిత్వం దక్కాలన్నది హరిరామ జోగయ్య ఆరాటం.
దాని కోసం ఆయన వయసులో ఉన్నపుడు ఏం చేశారో తెలియదు కానీ ప్రజారాజ్యం, జనసేనల వెనకాల ఉన్నది మాత్రం అదే ఆశయంతో..? అయితే రాజకీయాల్లో ఏది చేసినా కూడా తెర చాటునే ఉండాలి. తెర ముందుకు వచ్చి బోరవిడుచుకోకూడదు. అలా కనుక చేస్తే మాత్రం బూమరాంగ్ అవుతుంది. కమ్మ వారికి కూడా ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంది. అయితే ఎన్టీఆర్ టీడీపీ పెట్టి అన్ని వర్గాల ఆమోదంతో ఆ పదవిని దక్కించుకున్నారు. కాపుల విషయంలో మాత్రం వారికి ఆ ఛాన్స్ రాలేదు.
జనాభా పరంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్న వారికి ముఖ్యమంత్రి పదవి దక్కాల్సిందే. అలాగని ప్రజాస్వామ్య పద్ధతులలో ఎన్నికల రాజకీయాలను దాటుకుని ముందుకు సాగలేరు కదా. ఇక జోగయ్య లాంటి వారు అన్ని పార్టీలలో తిరిగి పదవులు సంపాదించుకున్నారు. తాముగా నాయకులు అయ్యారు. కానీ కులాన్ని ఎంతవరకూ సంఘటితం చేశారన్నది గుండెల మీద చేయి వేసుకుని తామే ప్రశ్నించుకోవాల్సిన మాట. ఇక మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లాంటి వారు కాపుల కోసం అన్నీ త్యాగాలు చేసి చిత్తశుద్ధితో చేస్తే కాపులు తలో పార్టీని ఎంచుకుని తమ రాజకీయం చూసుకున్నారు.
ఇపుడు హరిరామ జోగయ్య లాంటి వారు ఈ వయసులో కాపుల విషయంలో మాట్లాడినా వారికి పెద్దగా చేరుతుందా అన్నదే చూడాలి మరో వైపు అన్ని కులాలు తనకు సమానమే అంటూ వస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అలాంటి నాయకుడికి కుల మకిలి అంటించి మరింతగా అవకాశాలు దెబ్బతీసే విధంగానే కాపునాడు నేతల కార్యకలాపాలు సాగితే మాత్రం అందరికీ చేటు తెచ్చినట్లే.