Begin typing your search above and press return to search.

బురదపాములట...అయ్యన్న గురి ఎవరి మీద...?

By:  Tupaki Desk   |   29 April 2022 11:30 PM GMT
బురదపాములట...అయ్యన్న గురి ఎవరి మీద...?
X
పుట్టలో బురద పాములు అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. మూడేళ్ళుగా పుట్టలో దాక్కున్న పాములు అని కూడా అంటున్నారు. ఇంతకీ ఎక్కడ పుట్ట, ఏమా బురద పాముల కధా . ఇదే ఇపుడు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకించి టీడీపీలో చర్చనీయాంశంగా ఉంది.

బురద పాము అంటే నో పవర్ అనే కదా అర్ధం. మరి అలాంటి పాము గురించి సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న అయ్యన్న అంతలా కలత చెందాల్సిన అవసరం ఉందా అన్న చర్చ కూడా ఇంకో వైపు సాగుతోంది. అంటే దాని అర్ధం అయ్యన్న చెబుతున్న పాము బురద పాము కాదన్న మాట. పైగా పుట్టలో ఇన్నాళ్ళూ ఉన్నా కూడా తన పవర్ ఏదీ కోల్పోలేదు అని కూడా ఆలోచించాల్సిందే.

లేకపోతే బురద పాముల గురించి ఎవరైనా మధనపడతారా. బురద పాములను కనీసం పట్టించుకోరు కూడా. ఇక హై కమాండ్ పక్కన ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు అని అయ్యన్న అంటున్నారు. హై కమాండ్ ఆషామాషీగా ఎవరికి పడితే వారిని దగ్గర చేయదు. అలాగే ఫోటోలకు చాన్స్ ఇవ్వదు.

అంటే అక్కడ స్టఫ్ ఉంటేనే తప్ప హై కమాండ్ కూడా పట్టించుకోదు. ఇలా కనుక చూస్తే అయ్యన్నపాత్రుడు తాజాగా చేసిన విమర్శలలో ఎన్నో అర్ధాలు, పరమార్ధాలు ఉన్నాయనే చెప్పాలి. అంటే పేరుకు బురద పాము అని ఆయన అంటున్నా బుస కొట్టడమే కాదు, పస గలిగిన పాము గురించే ఆయన చెబుతున్నారు అనుకోవాలి.

ఇక ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం రాజకీయాలను చూస్తే మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీలో కీలకంగా ప్రస్తుతం ఉన్నారు. ఆయన మూడేళ్ళ తరువాతనే ఇపుడు యాక్టివ్ అయ్యారు. ఇక ఆయన గతంలో అనేక పార్టీలు మారారు. ఈ మధ్య దాకా ఆయన వైసీపీలోకి వెళ్తారు, జనసేనలోకి వస్తారు, బీజేపీలోకి వెళ్తారు అంటూ ప్రచారం అయితే సాగింది.

కానీ గంటా మాత్రం తాను టీడీపీలోనే అంటూ లేటెస్ట్ గా సంకేతాలు పంపుతున్నారు. ఆయన టీడీపీ హై కమాండ్ తో కూడా బాగా సన్నిహితంగా ఉంటున్నారు. ఇక విశాఖలో లోకేష్ పుట్టిన రోజును ఈసారి గంటా ఆద్వర్యాన జరిపించారు. తాజాగా ఆయన తాను గెలిచిన ఉత్తర నియోజకవర్గం వెళ్ళి మరీ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.

మొత్తానికి చూస్తే గంటా మార్క్ పాలిటిక్స్ టీడీపీ లో స్టార్ట్ చేశారు. దాంతోనే ఆయన ప్రత్యర్ధిగా ఉన్న అయ్యన్న ఇలా ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు అంటున్నారు. నిజానికి ఈ ఇద్దరు మధ్య అసలు పొసగదు అని అంతా అంటారు. అప్పట్లో అంటే టీడీపీ అధికారంలో ఉన్నపుడే విశాఖ సిటీలో జరిగిన భూ దందాల మీద గంటా ప్రమేయం మీద విచారణ జరిపించాలని అయ్యన్న డిమాండ్ చేశారు. అంటేనే ఈ ఇద్దరు మధ్య పచ్చగడ్డి వేస్తే ఏ లెవెల్ లో మండుతుంది అన్నది అర్ధమవుతోంది

మొత్తానికి గంటా వర్సెస్ అయ్యన్న రాజకీయం టీడీపీలో ఇపుడు మొదలైంది అంటున్నారు. చంద్రబాబు ఈ ఇద్దరినీ ఎలా దారికి తెస్తారో చూడాలి. అయ్యన్న ఫైర్ బ్రాండ్, గంటా రాజకీయ వ్యూహ కర్త. ఈ ఇద్దరూ బాబుకు ముఖ్యమే. సో చంద్రబాబు ఇపుడు ఇద్దరు నేతలను బ్యాలన్స్ చేసుకోమని చెప్పడం ద్వారానే ఉమ్మడి విశాఖ జిల్లాలో సైకిల్ ని పరుగులు పెట్టించగలరు అంటున్నారు.