Begin typing your search above and press return to search.
చిటికిన వేలితో లేపేస్తా.. మంత్రి కొడాలి నానికి మాజీ మంత్రి కొల్లు హెచ్చరిక
By: Tupaki Desk | 30 Nov 2021 11:35 AM GMTఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యల కలకలం సమసిపోకముందే మరో టీడీపీ మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'బందర్ రా.. చిటికెన వేలితో లేపేస్తా' అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అందరినీ తిట్టిపోసే వైసీపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై టీడీపీకి చెందిన యువ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు.
'కొడాలి నానీ.. బందరు రా.. చిటికిన వేలితో లేపేస్తా.. నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును తిట్టేంత వాడివా' అంటూ హీటెక్కించారు. మచిలీపట్నంలో టీడీపీ పార్లమెంట్ తెలుగు మహిళా సభలో కొల్లు రవీంద్ర ఈ కామెంట్స్ చేశారు. అయితే ఇవి ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.దీంతో దుమారం చెలరేగింది.
వైసీపీ నేతలు హద్దులు దాటి మాట్లాడుతున్నారని.. పవిత్రమైన చట్టసభల్లో మహిళలను కించపరుస్తున్నవారి దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆడపడుచులకు కొల్లు పిలుపునిచ్చారు. అన్ని రాసి పెట్టుకుంటున్నామని.. తగిన బుద్ది చెబుతామని కొల్లు హెచ్చరించారు.
కొల్లు మొదలుపెట్టిన ఈ హాట్ ప్రసంగాలను డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ మరింత హీటెక్కించారు. శాసనాలకు వేదికఅయిన అసెంబ్లీలో తెలుగింటి ఆడపడుచును అవమానించేలా వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రవర్తించారని ఆడిపోసుకున్నారు. ప్రశ్నించిన ప్రతీ సామాన్యుడి అమ్మ, అక్క, చెల్లి, భార్య శీలాన్ని నడిబజారులో అవమానించి పైశాచికానందం పొందినా ఆశ్చర్యపోవక్కర్లేదని విమర్శించారు.
గత రెండున్నరేళ్లుగా మంత్రి కొడాలి నాని, టీడీపీపైనా.. అధినేత చంద్రబాబుపైనా విరుచుకుపడుతున్నా ఏ ఒక్కరూ స్పందించలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబుకు జరిగిన అవమానం నేపథ్యంలో అందరూ ఏకమవుతున్నట్టుగా సంకేతాలు పంపిస్తున్నారు. అందుకే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగినట్టు అర్థమవుతోంది.