Begin typing your search above and press return to search.
ప్రజలకు కరెంట్ కోతలు ఇవ్వాలి.. అప్పుడే అర్థమైతది: మాజీ మంత్రి సంచలనం
By: Tupaki Desk | 15 Dec 2020 11:06 AM GMTప్రజలకు మరిచిపోయే మనస్తత్వం ఉంటుందని.. వారికి అన్ని వసతులు కల్పిస్తే మరిచిపోయి వేరే మాయలో పడిపోతారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరాలని ఆయన వ్యాఖ్యానించారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మారెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జనం మంచి వారు అనలా? అమాయకులు అనాలో తెలియడం లేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వాపోయారు. పనికిమాలిన భావాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనాలకు ప్రభుత్వం విలువ తెలియాలంటే ఇప్పుడు సంక్షేమ పథకాలను ఆపేసి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
24 గంటలు ఉచిత కరెంట్ కాకుండా కేవలం 3, 4 గంటలు కరెంట్ ఇవ్వాలని.. అప్పుడే అందరూ భజన చేసుకుంటూ కరెంట్ విలువ గుర్తిస్తారని మాజీ మంత్రి సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మేలు సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. మాజీ మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.