Begin typing your search above and press return to search.

యువ‌త‌లో న‌మ్మ‌కం క‌లిగించ‌డ‌మే లోకేష్‌ ముందున్న పరీక్ష‌!

By:  Tupaki Desk   |   29 Dec 2022 4:07 AM GMT
యువ‌త‌లో న‌మ్మ‌కం క‌లిగించ‌డ‌మే లోకేష్‌ ముందున్న పరీక్ష‌!
X
యువ‌గ‌ళం-ఈ పేరు వినేందుకు.. అనేందుకు బాగున్నా.. టీడీపీ యువ‌నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌డం.. వారిలో న‌మ్మకం క‌లిగించ‌డం అంత ఈజీ అయితే, కాద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే.. మాస్ ఇమేజ్ ఉంటే త‌ప్ప‌.. యువ‌త‌కు చేరువ కావ‌డం సాధ్యం కాదు. గ‌తంలో సీఎం జ‌గ‌న్ యువ‌త‌ను కాకుండా.. గ్రామీణ ప్ర‌జ‌ల‌ను, మ‌హిళ‌ల‌ను, వృద్ధుల‌ను టార్గెట్ చేసుకుని రాజ‌కీయం చేశారు.

ఇది స‌క్సెస్ అయింది. అయితే.. ఇప్పుడు నారా లోకేష్ కేవ‌లం యువ‌తను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇది మంచిదే అయినా.. దీనిని సాధించ‌డం మాత్రం అంత ఈజీకాద‌ని చెబుతున్నారు. దీనికి కార‌ణం.. యువ‌త ఇప్పుడు.. నాయ‌కుడు ఎవ‌రు అన్న‌ది కాదు.. త‌మ ఉద్యోగాలు, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తారా? లేదా? అనేది చూస్తున్నారు. ఈ విష‌యంలో వారిని న‌మ్మించ‌గ‌ల‌గాలి. న‌మ్మ‌కం పెంచ‌గ‌ల‌గాలి.

అంతేకాదు, రాజ‌కీయంగా కూడా యువ‌త‌కు ప్రాధాన్యం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేదివాస్త‌వం. కానీ, పార్టీ ప‌రంగా చూస్తే.. సీనియ‌ర్ల‌కు మాత్ర‌మే అవకాశం ఉంటుంద‌ని.. పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. దీంతో ఎంత మంది యువ‌త‌కు టికెట్లు ఇస్తార‌నేది సందేహంగానే ఉంది. ఒక‌వేళ ఇచ్చినా.. వార‌సుల‌కు కాకుండా.. ఎంత‌మందికి అవ‌కాశం ల‌భిస్తుంద‌నేది కూడా ప్ర‌ధానం.

ఈ రెండు విష‌యాలను ట‌చ్ చేసి లోకేష్ యువ‌త‌ను ఆక‌ర్షించ‌డం సాధ్య‌మైతే.. ఖ‌చ్చితంగా యువ‌త‌రం.. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ముందుకు సాగే అవ‌కాశం ఉంది. అయితే.. లోకేష్ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దిశ‌గా ఆలోచ‌న చేయ‌లేదు. కేవ‌లం జ‌గ‌న్‌ను తిట్ట‌డం స‌వాళ్లు విస‌ర‌డం వ‌రకే ప‌రిమితం అయ్యారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న అటు క్లాస్‌కు, ఇటు మాస్‌కు మ‌ధ్య‌లో ఊగిస లాడుతున్నారు. కనీ, వ‌చ్చే ఎన్నిక‌లు మాత్రం.. యువ‌త ప్రాధాన్యం పెర‌గ‌నుంది. మెజారిటీ ఓటు బ్యాంకు యువ‌తదే కావ‌డంతో అన్ని పార్టీలు కూడా ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నాయి. ఈ పోరులో లోకేష్ ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.