Begin typing your search above and press return to search.
విజయనగరంలో టీడీపీకి ఎఫెక్ట్.. కీలక నేత జంప్
By: Tupaki Desk | 31 Jan 2021 12:50 PM GMTఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీకి పట్టుకొమ్మ వంటి విజయనగరం జిల్లాకు చెందిన కీలక నాయకురాలు.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పడాల అరుణ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆమె బీజేపీలో చేరనున్నా రు. అయితే.. ఈ విషయంపై పెద్దగా చర్చలేదని అనుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో చూస్తే.. టీడీపీకి ఇబ్బంది కర పరిణామాలు తప్పేలా కనిపించడం లేదు. అయితే.. దీనిపై ఫోకస్ పెడితే.. మిగిలిన ప్రాంతాల్లోనూ పార్టీ ఇబ్బంది పడుతుందన్న భావనతో ఈ విషయానికి ప్రాధాన్యం ఇవ్వడంలేదు. అయితే.. పడాల జంప్‌తో జిల్లా టీడీపీలో ఇబ్బంది కర పరిస్థితి తప్పదనే అంచనాలున్నాయి.
గజపతి నగరం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పడాల అరుణ.. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఈ సామాజికవర్గానికి ఆమె అండగా నిలిచారు. దీంతో పడాల ఎటు ఉంటే వారు అటే ఉంటారు. అందుకే బీజేపీ కూడా తూర్పు కాపులపై దృష్టి పెట్టిన నేపథ్యంలో అరుణకు అవకాశం ఇచ్చిందని ఇక్కడ చర్చ నడుస్తోంది. ఇక, 2014లో టీడీపీ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కడం , బొత్స సత్యనారాయణ వంటి సీనియర్‌ను ఓడించడం వెనుక కూడా తూర్పుకాపుల ప్రాబల్యం పనిచేసింది.
అయితే.. గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని పడాల కోరినా.. బాబు ఆమెకు ఇవ్వలేదు. దీంతో తూర్పు కాపుల ఓట్లు సైలెంట్ గా బొత్స బాట పట్టాయి. ఇప్పుడు పడాల అరుణ ధీమా కూడా తూర్పు కాపులు అందరూ తనవెంటే ఉన్నారని.. ఇది వాస్తవమే కూడా. ఇతర సామాజిక వర్గాల్లో ఉన్న వారు.. టీడీపీకి అంతంత మాత్రంగానే ఉన్నారు. ఎక్కువగా క్షత్రియ సామాజిక వర్గం.. కాళింగ, తూర్పు కాపులు మాత్రమే టీడీపీకి బలమైన శక్తిగా ఉన్నారు. ఇప్పుడు అరుణ జంపింగ్‌తో ఈ వర్గం దూరమవుతుంది. అయితే.. అశోక్ గజపతిరాజు వంటి బలమైన నాయకుడు పుంజుకుంటే.. ఈ ఎఫెక్ట్ నుంచి టీడీపీ బయటపడే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.