Begin typing your search above and press return to search.

వైసీపీ పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి

By:  Tupaki Desk   |   28 April 2021 4:30 PM GMT
వైసీపీ పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి
X
ఏపీలోని అధికార వైసీపీని వీడేది లేదని ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు క్లారిటీ ఇచ్చారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. గతంలో చీరాలలో నిరంకుశ పాలన సాగిందని.. ఎమ్మెల్యే బలరాం రాకతో ఆ పరిస్థితి మారిందని తెలిపారు. ఆయనతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని.. అలాంటప్పుడు పార్టీ మారాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి రామారావు క్లారిటీ ఇచ్చారు.

వైసీపీలో ముఖ్యనేతలంతా కలిసికట్టుగా ఉండడం చూసి ఓర్వలేకనే కొందరు సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను నమొద్దని తెలిపారు.

1994,1999 లో టీడీపీ తరుఫున పోటీచేసి రామారావు చీరాల ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2004లోనూ టీడీపీ నుంచి తిరిగి పోటీచేశారు. కాంగ్రెస్ నేత రోశయ్య చేతిలో ఓడిపోయారు.

ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి చీరాల నుంచి పోటీచేసినా పరాజయం తప్పలేదు. ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల వరకు అందులోనే కొనసాగారు. ఆ తర్వాత చీరాల ఎమ్మెల్యే తో కలిసి వైసీపీలో చేరారు. ప్రస్తుతం పార్టీ మార్పుపై స్పందిస్తూ ఖండించారు.