Begin typing your search above and press return to search.

తండ్రిది అధికారం... త‌న‌యుడిదే పెత్త‌నం.. ఏపీలో గ‌డ‌బిడ‌!

By:  Tupaki Desk   |   29 Aug 2022 6:30 AM GMT
తండ్రిది అధికారం... త‌న‌యుడిదే పెత్త‌నం.. ఏపీలో గ‌డ‌బిడ‌!
X
కొంద‌రు నేత‌లు అంతే! వారికి అన్నీ తెలిసి కూడా చేసే ప‌నుల‌కు ఎవ‌రు మాత్రం ఏమంటారు? ఇప్పుడు ఇలాంటి వైసీపీ నాయ‌కుడి ఇలాకాలో జ‌రుగుతున్న ప‌రిస్థితినే చ‌ర్చించుకుంటున్నాం. మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న పేర్ని వెంక‌ట్రామ‌య్య‌.. ఉర‌ఫ్ నాని.. కుటుంబానికి సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉంది. ఆయ‌న తండ్రి పేర్ని కృష్ణ‌మూర్తి.. కాంగ్రెస్‌లోను, స్వాతంత్య్ర సంగ్రామంలోనూ పేరు తెచ్చుకున్నారు.

త‌ర్వాత‌.. ఆయ‌న కుమారుడికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన పేర్ని నాని కూడా.. బాగానే ప‌ని చేస్తున్నార‌నే టాక్ ఉంది. అయితే.. ఇప్పుడు ఆయ‌న వ్య‌వ‌హారం... విపక్షాల‌కు ఆయుధాలు అందించిన‌ట్టు అయింద‌నే వాద‌న వినిపిస్తోంది. బందరులో జరిగే గడపకుగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో అధికారులను వెంటబెట్టుకుని మాజీ మంత్రి తనయుడు పేర్ని కృష్ణ‌మూర్తి ఉర‌ఫ్‌కిట్టు పర్యటనలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం మెడికల్‌ కళాశాల భవనాల పనులను పరిశీలించడం నుంచి అభివృద్ధి కార్య‌క్ర‌మాల వ‌ర‌కు కిట్టు పాత్ర‌ను లేకుండా చూడ‌లేమ‌ని అంటున్నారు.

మాజీ మంత్రి తనయుడి రాజకీయం బందరు నియోజకవర్గంలో అధికమైందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. గ్రామాల్లో, నగరంలోని డివిజన్‌లలో ప్రజలకు ఏదైనా అవసరం పడి మాజీమంత్రి కార్యాలయానికి వస్తే ఈ పనికాదని ముఖం మీదే ఆయన కుమారుడు చెబుతున్నాడని వాపోతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజల వద్ద తమ పరపతిపోయే పరిస్థితులను ఎదుర్కొంటున్నామని పార్టీ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు.

గ్రామాల్లో, డివిజన్‌ లలో ఏదైనా గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్‌లకు వెళితే మాజీమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ చేయించాలని పోలీసులు చెబుతున్నారని, సర్పంచ్‌లుగా, గ్రామ ఇన్‌చార్జులుగా, డివిజన్‌ కార్పొరేటర్లుగా, డివిజన్‌ ఇన్‌చార్జులుగా ఉన్న తమకు ఇక విలువెక్కడుందని నాయ‌కులు వాపోతున్నారు అంట .

ప్ర‌జ‌ల నుంచి భారీ షాక్‌!

గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మాజీమంత్రి తనయుడు పేర్ని కిట్లు నగరంలోని 28వ డివిజన్‌లో పర్యటించారు. తమ డివిజన్‌ పరిధిలో ఏ హోదాలో పర్యటిస్తున్నారంటూ అతడిని కొందరు నిలదీశారు. కోనేరు సెంటరులో బాదంపాలు విక్రయించే షాపుల విషయంపై సమస్యను పరిష్కరించాలని చెప్పినా అతని మాట అక్కడ ఎవరూ వినలేదు. మాజీ మంత్రి వస్తే మాట్లాడుదామని నిర్ణయించుకున్నామని ముస్లిం పెద్దలు అన్నారు. గడపగడపకు కార్యక్రమంలో తమ సమస్యలు చెప్పుకుందామని అనుకున్నామని, మీకు చెబితే ఈ సమస్య పరిష్కారం కాదని పేర్ని కిట్టుకు తెగేసి చెప్పడం కొసమెరుపు.