Begin typing your search above and press return to search.
దోషిగా తీర్పు.. కోర్టు హాల్లోనే స్పృహ తప్పిన మాజీ మంత్రి
By: Tupaki Desk | 13 Jan 2022 3:57 AM GMTప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసిన కోర్టులు తాజాగా శిక్షలు కూడా విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీసీఎం జగన్ సహా చాలా మంది ప్రజాప్రతినిధుల కేసుల్లో తీర్పులు వెలువడుతున్నాయి.
మాజీ మంత్రి శంకర్ రావుపై నమోదైన 2 కేసుల్లో దోషిగా తేలారు. శంకర్ రావుపై మొత్తం 3 కేసులు నమోదు కాగా.. రెండింటిలో ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. మూడో కేసులో తగిన ఆధారాలు వేని కొట్టేసింది. దోషిగా తేలినట్లు ధర్మాసనం ప్రకటించడంతో కోర్టు హాల్లోనే శంకర్ రావు పడిపోయారు.
మాజీ మంత్రి శంకర్ రావుకు రెండు కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు జరిమానా విధించింది. ఓ కేసులో 2 వేల రూపాయలు, మరో కేసులో 1500 రూపాయలు చెల్లించాలని కోర్టు శంకర్ రావును ఆదేశించింది.
భూ వివాదంలో అక్రమంగా చొరబడి.. బెదిరించారన్న అభియోగంపై షాద్ నగర్ లో నమోదైన కేసులో ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఓ మహిళ ఇంట్లో అక్రమంగా చొరబడి బెదిరించారన్న కేసులోనూ తీర్పు వెలువడింది.
రెండు కేసుల్లోనూ దోషిగా ప్రకటించడంతో శంకర్ రావు కోర్టు హాల్ లోనే సృహ తప్పి పడిపోయాడు. కోర్టులోని న్యాయవాదులు, సిబ్బంది శంకర్ రావును లేపి నీళ్లు తాగించారు. కాసేపటికి శంకర్ రావు స్థిమితపడ్డారు.
షాద్ నగర్ లో నమోదైన మరో బెదిరింపు కేసు విషయంలో తగిన ఆధారాలు లేకపోవడంతో న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది.