Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు షాకిచ్చిన మాజీ మంత్రి..
By: Tupaki Desk | 8 Nov 2020 2:10 PM GMTప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు శక్తిసామర్థ్యాలపై జనాల్లో అపనమ్మకంతో నేతలు జారి పోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలుకు జారీ పోగా తాజాగా మాజీ మంత్రి కూడా టీడీపీకి రాజీనామా చేశారు.
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి తన భార్యతో కలిసి టీడీపీకి రాజీనామా చేశారు. ఒక్కమాట కూడా చెప్పకుండా పార్టీ పదవి నుంచి తప్పించడంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత ఏపీ టీడీపీకి ఈ షాక్ లు తగులుతున్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి తాళ్లపాక రమేశ్ రెడ్డి, ఆయన భార్య అనురాధ రాజీనామా చేశారు. గతంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా అనురాధ ఉన్నారు. పార్టీ ఏర్పాటు, ఆ తర్వాత కూడా పార్టీలో కొనసాగుతున్నాయని తనను పదవి నుంచి తప్పించే సమయంలోనూ కనీసం మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తితో రాజీనామా చేశారు.
1982 నుంచి పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రి తాళ్లపాక రమేశ్ రెడ్డి టీడీపీ ఆవిర్భావం నుంచి దివంగత ఎన్టీఆర్ కుటుంబంతో అనుబంధం ఉంది. ఎమ్మెల్యేగా రమేశ్ రెడ్డి, రాష్ట్రమంత్రిగా రమేశ్ రెడ్డి భార్య అనురాధ నెల్లూరు మున్సిపల్ చైర్ పర్సన్ గా పనిచేశారు.