Begin typing your search above and press return to search.
మాజీ మిస్ చెన్నైను 40 రోజులు గదిలో బంధించి నరకం చూపించాడట
By: Tupaki Desk | 6 Feb 2022 8:30 AM GMTవిన్నంతనే నమ్మబుద్ది కాదు. ఒక పోలీసు అధికారి అయి ఉండి ఇలా చేస్తాడా? అంటూ డిపార్ట్ మెంట్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ మిస్ చెన్నైను ఒక గదిలో బంధించి.. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచక పోలీసు అధికారి ఉదంతంగా చెప్పాలి. అసలు పోలీసు అధికారి ట్రాప్ లోకి ఆమె ఎలా వెళ్లిందన్న విషయంలోకి వెళితే..
చెన్నైలోని పళ్లి కరణైకు చెందిన ఒక యువతి మాజీ మిస్ చెన్నై. ఆమె తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటారు. ఆమెకు ఈస్ట్ కోస్టు రోడ్డులో ఒక ప్లాట్ ఉండేది. స్థానికంగా ఉండే ఒక బిల్డర్ కు ఇంటిని కొనేందుకు కలిసి డీల్ చేసుకుంది. అయితే.. అందులో సదరు బిల్డర్ మోసం చేశాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయటానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఎస్ఎస్ఐ కార్వెల్ అనే అధికారితో పరిచయమైంది.
ఆమెను ట్రాప్ చేయాలన్న దుర్బుద్దితో అతడు.. కేసు విచారణ పేరుతో ఆమెను తరచూ కలిసేవాడు. ఇదే క్రమంలో అతడికి ఆమె తన సమస్యల్ని చెప్పుకుంది. వాటి పరిష్కారం పేరుతో ఇంట్లో కొన్ని పూజలు చేయిస్తే అంతా బాగుంటుందని నమ్మబలికాడు. అతడి మాటల్లోని మోసాన్ని గుర్తించలేని ఆమె అందుకు ఒప్పుకుంది. పూజల పేరుతో కొందరిని రంగంలోకి దించాడు. అనంతరం ఆమెను.. ఒక గదిలో బంధించాడు. లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవటంతో.. 40 రోజుల పాటు గదిలోనే బంధించేశాడు.
అలా 40 రోజుల పాటు నరకం చూసిన ఆమె.. తెలిసిన వారి సాయంతో ఇంట్లో నుంచి బయటపడింది.సదరు పోలీసు అధికారి తనను వేధిస్తున్న విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. షాక్ తిన్న ఉన్నతాధికారులు సదరు అధికారి చేసిన మోసంపై కేసు నమోదు చేయించారు. సందట్లో సడేమియా అన్నట్ల సదరు పోలీసు అధికారి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు అతడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఉదంతం పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది.