Begin typing your search above and press return to search.

మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ మళ్లీ అరెస్ట్ .. ఏమైందంటే

By:  Tupaki Desk   |   7 Oct 2021 6:22 AM GMT
మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ మళ్లీ అరెస్ట్ .. ఏమైందంటే
X
మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ కారును ఢీకొట్టి 9మంది కార్మికులను గాయపర్చిన రోడ్డు ప్రమాదం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగానే ప్రముఖ మోడల్ రాజకన్య బరువాను గౌహతి పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. మోడల్, 2016 మిస్ ఇండియా ఫైనలిస్ట్ అయిన రాజకన్య గత వారం గౌహతి నగరంలో పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటుకు చెందిన 9మంది కార్మికులను గాయపర్చారు. పోలీసులు రాజకన్యను గౌహతి మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ఆరుగురు సభ్యుల వైద్యబృందం ముందు హాజరు పర్చారు.

వైద్యుల బృందం రాజకన్యను పరీక్షించి, ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనలో నిందితురాలైన రాజకన్యను గతంలో అసోం పోలీసులు అరెస్టు చేసినా ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపించి ఆమె బెయిలుపై విడుదల అయ్యారు.అక్టోబరు 2వతేదీన రాత్రి గౌహతి నగరంలో ఓ విందుకు హాజరైన రాజకన్య మద్యం మత్తులో కారులో ఇంటికి వస్తూ రుక్మిణిగావ్ ప్రాంతంలో 9 మంది పీడబ్ల్యూడీ కార్మికులను గాయపరిచినట్లు ఆరోపణలు వచ్చాయి.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఈ కేసులో నిందితురాలైన రాజకన్య బరువాను గౌహతి నగర పోలీసులు అరెస్టు చేశారు, కానీ ఆమెకు ఒక రోజులోనే బెయిల్ వచ్చింది. దీంతో అసోం పోలీసులపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పించారు.తర్వాత అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈ విషయంపై పునర్విచారణ చేయాలని ఆదేశించారు. రాజకన్యకు బెయిల్ పొందడానికి సహాయపడిన ఇద్దరు పోలీసు అధికారులపై విచారణ జరపాలని సీఎం అసోం పోలీసులను ఆదేశించారు.దీంతో పోలీసులు మోడల్ రాజకన్యపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 279, 294, 388, 353ల కింద కేసు నమోదు చేశారు.