Begin typing your search above and press return to search.

మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య.. కారణమిదే?

By:  Tupaki Desk   |   14 April 2022 7:23 AM GMT
మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య.. కారణమిదే?
X
టీఆర్ఎస్ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె తాటి మహాలక్ష్మి నిన్న ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మహాలక్ష్మి తెల్లవారినా తన గది తలుపులు తీయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలుపులు పగులకొట్టి గదిలోకి వెళ్లారు.లోపల కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయారు.

మహాలక్ష్మీ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాకయ్యారు. వెంటనే ఆమెను కిందికి దించి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించగా.. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలిసిన తాటి వెంకటేశ్వర్లు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు.కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఆయనను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

తాటి మహాలక్ష్మీ ఎంబీబీఎస్ పూర్తయ్యింది. పీజీ అడ్మిషన్ కోసం ప్రిపేర్ అవుతోంది. కూతురు ఎందుకు చనిపోయిందో తెలియక కుటుంబం ఆవేదన చెందుతోంది.

కూతురిని విగతజీవిగా చూడాల్సి రావడంపై మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా కలత చెందాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.