Begin typing your search above and press return to search.
వచ్చే వినాయకచవితి వరకేనా జగన్ ప్రభుత్వం?
By: Tupaki Desk | 8 Sep 2022 4:50 AM GMTజగన్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే వినాయకచవితి తర్వాత జగన్ ప్రభుత్వం ఏపీలో ఉండదని ఆయన చేసిన హాట్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు. రాజకీయాల్లో వ్యక్తిగత, నైతిక విలువలను జగన్ చంపేశారని విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తానెప్పుడు సీఎం జగన్ సతీమణి భారతిని విమర్శించలేదన్నారు. ఆమె సీఎం అయితే బాగుంటుందని మాత్రమే తానన్నానని గుర్తు చేశారు. తనపై ఎలాంటి కేసులు లేవని.. జగన్ పైన 33 కేసులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. విశాఖ వైఎస్సార్సీపీ నేత కేకే రాజు కాస్త్ర జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పారు.
ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. అలాగే రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని విష్ణుకుమార్ రాజు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మళ్లీ 2 వేల నోట్లు కనిపించడం లేదని చెప్పారు. మళ్ళీ కేంద్రం 2 వేల నోట్లు రద్దు చేస్తే.. జగన్ ప్రభుత్వం పడిపోతుందని తేల్చిచెప్పారు.
కాగా 2014లో టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ తరఫున విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి విష్ణుకుమార్ రాజు ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీ శాసనసభాపక్షం నాయకుడిగా కూడా వ్యవహరించారు. 2019లో మళ్లీ విశాఖ నార్త్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కేవలం 18,790 ఓట్లు మాత్రమే సాధించారు. ఏకంగా నాలుగో స్థానంలో నిలిచారు.
కాగా వచ్చే వినాయకచవితిలోపు జగన్ ప్రభుత్వం పడిపోతుందని విష్ణుకుమార్ రాజు చెప్పడం, జగన్ సతీమణి భారతి సీఎం అవుతుందనడంపై నెటిజన్లలో చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా రాష్ట్రంలో సంచలన పరిణామాలు చూస్తారని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి వ్యాఖ్యల వెనుక కారణం ఏమై ఉంటుందా అని చర్చ జరుగుతోంది.
అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్న జగన్ బెయిల్ రద్దు అవుతుందని.. దీంతో ఆయన మళ్లీ జైలుపాలవుతారని అంటున్నారు. దీంతో సతీమణి భారతి సీఎం అవుతుందనేదే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల వెనుక ఉద్దేశమంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.