Begin typing your search above and press return to search.
పార్టీకి నష్టం జరిగేది ఇలాంటి వాళ్ళవల్లేనా ?
By: Tupaki Desk | 21 April 2022 5:12 AM GMT'వందమందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధం చేసుకున్నాము'..ఇది తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్య. వైసీపీ నేతలను ఉద్దేశించి బుద్ధా ఈ వార్నింగుతో కూడిన వ్యాఖ్య చేశారు. చంద్రబాబునాయుడుపై చెత్తవాగుడు వాగితే చూస్తు ఊరుకునేది లేదన్నారు.
అలాంటి వాళ్ళకోసం వందమందితో సూసైడ్ బ్యాచ్ ను సిద్ధం చేశామన్న వ్యాఖ్య సంచలనంగా మారింది. నిజానికి చెత్తవాగుడు అంటే టీడీపీ, వైసీపీల్లోని చాలామంది నేతలు ఇలాగే మాట్లాడుతున్నారు.
టీడీపీ, వైసీపీలు ప్రత్యర్ధి పార్టీల దశనుండి శతృ పార్టీల స్ధాయికి చేరుకుని చాలాకాలమే అయ్యింది. కాబట్టే ఒకరిపై మరొకరు చాలా అసహ్యంగా ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఇక్కడ రెండు పార్టీల్లోని నేతల్లోను తప్పులున్నాయి. రెండు పార్టీల నేతలు హద్దులు దాటేసి తిట్టేసుకుంటున్నారు. ఇక్కడ పేర్లు అనవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గురించి టీడీపీ నేతలు అలాగే మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు గురించి వైసీపీ నేతలూ అలాగే మాట్లాడుతున్నారు.
ఈ నేపధ్యంలోనే బుద్ధా మాట్లాడుతూ సూసైడ్ బ్యాచ్ అంటు చెత్త వ్యాఖ్య చేశారు. బుద్ధా వ్యాఖ్య వల్ల టీడీపీకి ఎలాంటి మైలేజీ పెరగదన్నది వాస్తవం. తానేదో చంద్రబాబు రక్షకుడన్నట్లుగా బుద్ధా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబుపై చెత్త వాగుడు అని బుద్ధా అనటంలో అర్ధమేలేదు. ఎందుకంటే వైసీపీ నుంచి ఎవరు కూడా చంద్రబాబుపై బుధవారం ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయలేదు. మరలాంటపుడు వైసీపీ నేతలను ఉద్దేశించి బుద్ధా సూసైడ్ బ్యాచ్ అంటు బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది ?
అధికార పార్టీ నేతలను ఉద్దేశించి టీడీపీ నేతలు నాలుగు మాటలంటే మరి వైసీపీ నేతలు ఊరుకుంటారా ? ప్రతిపక్షంలో ఉన్న నేతలే అధికార పార్టీ నేతలను బెదిరిస్తుంటే ఇక వైసీపీ నేతలు ఎందుకు ఊరుకుంటారు ? నిజానికి ఎవరు ఎవరిని బెదిరించినా తప్పే.
ప్రభుత్వ వైఫల్యాలను, లోపాలను ప్రధాన ప్రతిపక్షం నేతలు ఎత్తిచూపటం లో తప్పులేదు. కానీ నోటికొచ్చినట్లు మాట్లాడటం వల్ల బుద్ధా లాంటి నేతలతో పార్టీకి నష్టమే కానీ లాభం ఏమీ ఉండదు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా చంద్రబాబే వీళ్ళని కట్టడి చేయకపోతే ఇబ్బందులు తప్పవు.