Begin typing your search above and press return to search.

ఉచితం పైన ప్రొఫెసర్ మాట : సంక్షేమాన్ని అలా అంటారా..?

By:  Tupaki Desk   |   4 Aug 2022 1:30 PM GMT
ఉచితం పైన ప్రొఫెసర్ మాట : సంక్షేమాన్ని అలా అంటారా..?
X
సంక్షేమ పధకాలను పేదలను ఇస్తూంటే కేంద్రం వాటిని ఉచితాలుగా అభివర్ణించడం దారుణం అని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్ అయ్యారు. పేదలకు ఇంత పెడితే దాని మీద కడుపు మంటనా అని కూడా అంటున్నారు. ఈ దేశంలో పేదలకు సంక్షేమ పధకాలు ఇవ్వడం అంటే అది ఉచితంగా కనిపిస్తోందా అని ఆయన మండిపడ్డారు.

ఇంతకీ ప్రొఫెసర్ మాటలలో భావన ఏంటి అంటే ఉచితాల మీద సుప్రీ కోర్టులో ఫైల్ అయిన ఒక పిటిషన్ మీద కేంద్రం పధకాలను ఉచితంగా పేర్కొంది. అంతే కాదు ఈ మధ్యనే ప్రధాని మోడీ కూడా యూపీ టూర్ లో ఉచిత పధకాలు వద్దు అన్నట్లుగా మాట్లాడారు. ఇలా కేంద్రం తన వైఖరిని సంక్షేమం మీద బయటపెట్టుకుంటూ వస్తోంది.

దాంతో మండిన ప్రోఫెసర్ ఒక పవర్ ఫుల్ ట్వీట్ చేశారు. అదిపుడు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. గత అయిదు ఆర్ధిక సంవస్తరాలలో వరసబెట్టి బ్యాంకులు ఏకంగా పది లక్షల కోట్ల రూపాయాల రుణాలను మాఫీ చేశాయని ఆయన గుర్తు చేశారు. వాటి వల్ల పూర్తిగా లబ్ది పొందింది బడా బాబులు, కార్పోరేటర్లే అని ఆయన అన్నారు.

ఈ వివరాలను కేంద్రమే పార్లమెంట్ లో వెల్లడించింది అని కూడా ఆయన గుర్తు చేశారు. మరి దాంతో పోలిస్తే సంక్షేమ పధకాలు అమలు చేయడంలో తప్పేముందని ఆయన వాదన. దీని వల్ల నూటికి తొంబై శాతం పేదలే లబ్ది పొందుతున్నారు కదా అని ఆయన అంటున్నారు.

అంటే పేదలకు ఏదైనా స్కీమ్ అమలు చేస్తే ఉచితం అంటూ ఎకసెక్కమాడే కేంద్రం పెద్దలకు అప్పనంగా ప్రజా ధనాన్ని రుణ మాఫీల పేరిట దోచిపెట్టడాన్ని ఆయన బహు చక్కగా ఎండగట్టారు.

అదే టైం లో మోడీ సర్కార్ పేదల వ్యతిరేక విధనాలను కూడా జనం దృష్టికి తెచ్చారనుకోవాలి. ఏది ఏమైనా సంక్షేమాన్ని ఉచితం అని ఎలా అంటారు అని ఆయన వేసిన ప్రశ్నలోని లాజిక్ పాయింట్ కి కేంద్రం జవాబు చెప్పగలదా అంటున్నారు. ఇక సంక్షేమాన్ని పట్టుకుని ఉచితం అంటున్నారు, దానికి సిగ్గుండాలి అంటూ ఆయన ఘాటు కామెంటే చేశారు.