Begin typing your search above and press return to search.
అశోక్ వర్సెస్ సంచయిత..హీటెక్కిపోతోంది
By: Tupaki Desk | 8 March 2020 1:30 AM GMTఏపీలో మాన్సాస్ ట్రస్టు విషయం హీటెక్కిపోతోంది. విజయనగర రాజుల వంశం ఆధ్వర్యంలోని మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా ఉన్న టీడీపీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును ఉన్నపళంగా ఆ పదవి నుంచి పీకేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు... ఆ పదవిలో అశోక్ సోదరుడు, దివంగత ఆనంద గజపతిరాజు కూతురు సంచయితను నియిస్తూ రెండు రోజుల క్రితం సంచలనం నిర్ణయం తీసుకున్న దరిమిలా టీడీపీ వర్సెస్ వైసీపీ మొదలైన మాటల యుద్దం ఇప్పుడు బాబాయి వర్సెస్ అమ్మాయిగా మారిపోయింది. మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయితను నియమించడం తప్పని - ఆమె క్రైస్తవురాలు అంటూ అశోక్ చేసిన వ్యాఖ్యలకు సంచయిత కూడా అదే రేంజిలో కౌంటర్ వదిలేశారు. హిందువులైతే మాత్రం వాటికన్ సిటీకి వెళ్లినంత మాత్రాన క్రైస్తవులు అయిపోతారా? అంటూ సంచయిత వదిలిన తూటా లాంటి మాట అశోక్ వర్గాన్ని ఆత్మరక్షణలో పడేసిందనే చెప్పాలి.
మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయితను నియమించడం, ఆమె ప్రమాణ స్వీకారం చేయడం వెంటవెంటనే జరిగిపోగా... టీడీపీ దీనిపై తనదైన రేంజిలో విమర్శలు గుప్పిస్తున్నా.. అశోక్ మాత్రం శనివారం దాకా దీనిపై అసలు నోరే విప్పలేదు. తాజాగా శనివారం మీడియా ముందుకు వచ్చిన అశోక్... మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత నియామకం తప్పని పేర్కొన్నారు. అంతేకాకుండా వాటికన్ సిటీని సందర్శించిన సంచయిత క్రిస్టియన్ కాకుండా ఎలా ఉంటారని కూడ ఓ లాజిక్ లాగారు. అంతటితో ఆగని అశోక్... చైర్ పర్సన్ గా సంచయిత నియామకంపై న్యాయపోరాటం చేస్తానని కూడా అశోక్ ప్రకటించారు. ఈ లాజిక్ అశోక్ వర్గానికి ఒకింత బలం చేకూర్చినట్లుగా కనిపించినా... సంచయిత ఎంట్రీ ఇవ్వడంతో పాటుగా తన బాబాయే తనపై విమర్శలు గుప్పిస్తారా? అంటే ఆవేదన వ్యక్తం చేయడంతో అశోక్ వర్గం నిజంగానే డిఫెన్స్ లో పడిపోయిందన్న వాదన వినిపిస్తోంది.
అశోక్ తనపై చేసిన ఆరోపణలు, వినిపించిన వాదనలకు కౌంటర్ ఇచ్చే దిశగా సంచయిత సంచలన వ్యాఖ్యలే చేశారు. ఆమె ఏమన్నారంటే... ‘‘నేను హిందువుని. నా మతం గురించి బాబాయ్ మాట్లాడితే బాధేస్తోంది. వాటికన్ సిటీ వెళ్లి ఫోటో దిగితే నేను క్రిష్టియన్ అవుతానా? అశోక్ గజపతి రాజు ఎప్పుడూ మసీదు చర్చికి వెళ్లలేదా? మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ కావడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. మా తాతగారు పీవీజీ రాజు వారసత్వం కొనసాగించడానికీ నాకు హక్కుంది. అతిథికి ట్రస్ట్ బోర్డు లో అవకాశం కల్పించినపుడు నన్నెందుకు పక్కన పెట్టారు. ఆరోజు నేను కనిపించలేదా?’’ అని సంచయిత తనదైన శైలి ప్రశ్నలను సంధించారు. మొత్తంగా ఇటు సంచయితపై అశోక్, అటు అశోక్ పై సంచయిత విసిరిన ప్రశ్నలు మాన్సాస్ ను హీటెక్కించాయని చెప్పక తప్పదు.