Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు కొత్త టెన్షన్ తెచ్చేలా మారిన '30' మంది మాట
By: Tupaki Desk | 10 May 2022 7:30 AM GMTరాజకీయ నేతలు అన్నాక తరచూ ఏదో ఒక వ్యాఖ్య చేయటం.. తమ మాటలతో వార్తల్లో నిలవటం.. అందరూ తాను మాట్లాడిన దాని గురించి మాట్లాడుకునేలా చేయటం లాంటివి చేస్తుంటారు. అయితే.. ఇందుకు భిన్నంగా కొందరు నేతలు చేసే వ్యాఖ్యల్ని అండర్ లైన్ చేసుకొని మరీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారు ఉంటారు.
అలాంటి కోవలోకే వస్తారు క్లీన్ చిట్ రాజకీయాల్ని చేస్తూ.. ఎలాంటి మరకలు లేకున్నా.. లక్ తక్కువగా ఉన్న నేతగా సుపరిచితులు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ మధ్యనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తలెంగాణ ప్రభుత్వ అవినీతి మీద కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ సర్కారుపై కేంద్రం తీసుకునే చర్యలు ఆధారంగానే తాను పార్టీలో చేరాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్పిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వ అవినీతి మీద కేంద్రం చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
అదేం ఖర్మో కానీ.. ఎప్పుడూ చూసినా.. ఏదో ఒక తప్పు నిర్ణయాన్ని తీసుకునే కొండా.. తాజాగా బీజేపీలోకి చేరటం కూడా ఆ కోవలోకే వస్తుందని చెబుతారు. టీఆర్ఎస్ పై బీజేపీ మరింత బలంగా పోరాడితే.. మరో 30 మంది నేతలు బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
తెలంగాణకు మరోప్రాంతీయపార్టీ అవసరం ఉందన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ రేవంత్ రెడ్డి నుంచి తనకు ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బలంగా పోరాడే పార్టీకి తాను మద్దతు ఇస్తానని చెప్పిన ఆయన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కొండా నోటి నుంచి వచ్చిన 30 మంది మాట గులాబీ బాస్ కు కొత్త గుబులుగా మారుతుందని చెప్పక తప్పదు.