Begin typing your search above and press return to search.

తెలంగానం : చిన్నారి ప్రాణాలు నిలిపిన మాజీ ఎంపీ !

By:  Tupaki Desk   |   20 May 2022 9:32 AM GMT
తెలంగానం : చిన్నారి ప్రాణాలు నిలిపిన మాజీ ఎంపీ !
X
ల‌క్ష‌ల్లో ఖ‌ర్చయ్యే ఆప‌రేష‌న్ ను ఓ మాజీ ఎంపీ త‌న చొర‌వ‌తో సంబంధిత స‌మ‌స్య ప‌రిష్క‌రించి పేదింట వెలుగులు నింపారు. భువ‌న‌గిరి మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్ స్వ‌త‌హాగా వైద్యుడు కావ‌డంతో ఓ జ‌ర్న‌లిస్టు సాయంతో ఆయ‌న దగ్గ‌ర‌కు చేరిన ఆ పేద కుటుంబానికి ఆస‌రా ఇచ్చి, అండ‌గా నిలిచి, హార్ట్ ఆప‌రేష‌న్ చేసి పంపారు.

ఇప్పుడీ వార్తకు తెలంగాణ వాకిట మంచి స్పంద‌న వ‌స్తోంది. నాయ‌కులు తాము చ‌దువుకున్న చ‌దువుకు ఇస్తున్న గుర్తింపు కానీ లేదా ఆప‌ద స‌మ‌యంలో వృత్తి ధ‌ర్మం త‌ప్ప‌ని నైజం కానీ ప్ర‌జ‌ల జేజేలు అందుకునేందుకు కార‌ణం అవుతోంది. ఆ విధంగా ఆ మాజీ ఎంపీ పేదింట బ‌తుకుల‌కు తానున్నాని చెప్పి ధైర్యం చెప్పి పంపారు.

ఇప్పుడిక ఆ బాలుడు న‌వ్వులు చిర‌కాలం నిలిచిపోతాయి ఆ త‌ల్లిదండ్రుల క‌ళ్ల‌లో ! నాయ‌కులు అంటే కేవ‌లం మాట‌లు చెప్పి త‌ప్పుకునే వారు కాదు.. త‌మ చ‌దువునూ నేప‌థ్యాన్నీ అన్నింటినీ స‌కాలంలో వాడుకుని బాధార్తుల‌కు గుప్పెడంత భ‌రోసా ఇవ్వ‌డం కూడా అని న‌ర్స‌య్య‌గౌడ్ నిరూపించారు.

ఈయ‌న లానే అదే తెలంగాణ‌లో జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ (టీఆర్ఎస్) వైద్యుడే ! ఈయ‌న కూడా వీలున్నంత మేర ప్రజారోగ్యంపై దృష్టి సారిస్తుంటారు. క‌రోనా స‌మ‌యంలో త‌న వంతు బాధ్య‌త‌గా వైద్య సేవ‌లు అందించి ఎంద‌రో ప్ర‌శంస‌లు అందుకున్నారు కూడా !

నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్ గ్రామానికి చెందిన హర్షిత్ కు ఆయువు పోసిన మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్ కానీ క‌రోనా వేళ‌ల్లో త‌న‌వంతు బాధ్య‌త‌ను మ‌రువ‌ని సంజ‌య్ కానీ ఇతరు రాజకీయనాయకులకు ఆద‌ర్శ‌నీయులే ! నాయ‌కులు బాధ్య‌త‌గా ఉండ‌డమే కాదు అవ‌స‌రం అయితే త‌మ వంతుగా సాయం చేయ‌డం అన్న‌ది అంతుకుమించిన క‌ర్త‌వ్యం కూడా ! న‌ర్స‌య్య గౌడ్ మొన్నామ‌ధ్య రోడ్డు ప‌క్క‌న తాటి ముంజ‌లు అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్న ఓ ఇంట‌ర్ విద్యార్థితో మాట్లాడి, ఆయ‌న్ను అభినందించి వెళ్లారు. ఇదే కాదు వీలున్న సంద‌ర్భాల్లో వీలున్నంత‌గా యువ‌త‌ను మంచి దిశ‌గా న‌డిపే విధంగా ఆయ‌న మాట‌లు కానీ సోష‌ల్ మీడియాలో పోస్టులు కానీ ఉంటాయి.