Begin typing your search above and press return to search.

మాజీ ఎంపీ రాయపాటికి తీవ్ర అస్వస్థత

By:  Tupaki Desk   |   19 Jun 2020 4:45 AM GMT
మాజీ ఎంపీ రాయపాటికి తీవ్ర అస్వస్థత
X
గుంటూరు మాజీ ఎంపీ , టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న ఆయనకు తాజాగా చాతినొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ స్టార్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాయపాటి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు.

లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి రాయపాటి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. తాజాగా ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.

బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో రాయపాటిని సీబీఐ విచారిస్తోంది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును చంద్రబాబు హయాంలో చేజిక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ సంస్థ రాయపాటికి చెందిందే. ఇదే బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదు. ఆ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.

ఇక రాయపాటినే ఇటీవల ఓ హీరోయిన్ మస్కా కొట్టింది. సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మాజీ ఎంపీ రాయపాటికి కాల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. రాయపాటిపై ఉన్న కేసులు మాఫీ చేస్తామని నమ్మించారు. దీనిపై అనుమానం వచ్చిన రాయపాటి వెంటనే సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు ఫోన్ కాల్ చేసింది మలయాళ నటి లీనా మోరియాపాల్ అని గుర్తించినట్టుగా సమాచారం. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో లీనా హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకుంది. ఆమె అరెస్ట్ కు రంగం సిద్ధమైంది.