Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ కు పాజిటివ్‌!

By:  Tupaki Desk   |   24 May 2020 9:10 AM GMT
పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ కు పాజిటివ్‌!
X
పాకిస్థాన్ వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ఆ దేశంలో కూడా భారీస్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఈక్ర‌మంలోనే ఆ దేశ మాజీ క్రికెటర్ తౌఫీక్ ఉమర్ వైరస్ బారిన పడ్డాడు. 2000 సంవత్సరంలో టెస్ట్, వన్డే క్రికెట్‌లో కీలక ఆటగాడిగా కొనసాగిన ఈ బ్యాట్స్‌ మన్‌ కు వైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ విష‌యాన్ని ఆ దేశ స్పోర్ట్స్ చానెల్ క్రికెట్ పాకిస్థాన్ ప్ర‌క‌టించింది. పాజిటివ్ రావ‌డంతో తన నివాసంలోనే సెల్ఫ్ ఐసోలేషన్‌ లో ఉంటున్నాడు.

ఉమ‌ర్ తౌఫీక్ 2001లో బంగ్లాదేశ్‌‌ టెస్ట్ మ్యాచ్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌ లోనే 163 బంతుల్లో 104 పరుగులు స‌త్తా చాటాడు. ఇమ్రాన్ నజీర్ - సల్మాన్ బట్‌ లతో అద్భుత ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇత‌డు లెఫ్టాండర్. చివరిసారిగా 2014లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్‌ లో ఆడాడు.

అత‌డి క్రికెట్‌ప‌రంగా మొత్తం 44 టెస్టు‌లు - 22 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో 7 సెంచరీలు - 14 హాఫ్ సెంచరీలు చేసి మొత్తం 2,963 పరుగులు చేశాడు. వన్డేల్లో 504 రన్స్ చేశాడు. 2016‌లో అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు పలికాడు.