Begin typing your search above and press return to search.
తొలిసారి ట్రంప్ పాలనపై ఒబామా నోరిప్పారు.. ఏమన్నారంటే?
By: Tupaki Desk | 28 July 2019 10:42 AM GMTఅధికార బదిలీ జరిగిన తర్వాత.. అధికారం నుంచి బయటకు వచ్చిన నేత ఎలా వ్యవహరించాలో ఒబామాను చూస్తే అర్థమవుతుంది. తన పదవీ కాలం పూర్తి అయ్యాక అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న ఒబామా.. తన తర్వాత అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ గురించి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా స్పందించింది లేదు.
మన రాజకీయాల మాదిరి కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తెల్లారి నుంచే ఏదో ఒక విమర్శ చేసే దానికి భిన్నంగా ఏళ్లకుఏళ్లుగా మౌనంగా ఉన్న ఒబామా తాజాగా ట్వీట్ లో తాను చెప్పాలనుకున్న విషయాన్నిచెప్పేసిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు.. వ్యాఖ్యలు చేసినప్పటికీ ఒబామా స్పందించింది లేదు. అందుకు భిన్నంగా తొలిసారి ఆయన నోటి నుంచి ట్రంప్ పాలనపై వెలువడిన వ్యాఖ్య ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇటీవల కాలంలో ట్రంప్ అదే పనిగా జాత్యహంకార వ్యాఖ్యల్ని చేయటం తెలిసిందే. నలుగురు మహిళా కాంగ్రెస్ సభ్యురాళ్లను ఉద్దేశించి వారిని దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆయన వ్యాఖ్యలు జాత్యాహంకారంతో ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఒబామా సతీమణి మీషెల్లీ సైతం ఇప్పటివరకూ ఒక్క విమర్శ చేయనప్పటికీ.. తాజాగా మాత్రంట్రంప్ తీరును ఆమె తప్పు పట్టారు.
ఇదిలా ఉంటే.. ట్రంప్ జాత్యహంకార తీరును తీవ్రస్థాయిలో తప్పు పడుతూ 148 మంది ఆఫ్రికన్ అమెరికన్ లు వాషింగ్టన్ పోస్టులో ఒక కథనాన్ని రాశారు. ఇందులో ట్రంప్ తీరును తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. ఈ కథనంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ద్వారా ట్రంప్ తీరుపై తన స్పందనను ఒబామా వెల్లడించారని చెప్పాలి.
తన పాలనా కాలంలో ఆఫ్రికన్ అమెరికన్ బృందం సాధించిన విజయాలు.. కృషిని తాను ఇప్పటికి గర్విస్తానని.. తాము సాధించిన పనుల కంటే కూడా వారింకా అమెరికా సంక్షేమం కోసం చేస్తున్న పోరాటం తనను మరింత గర్వపడేలా చేస్తుందని వ్యాఖ్యానించారు. తాజా వ్యాఖ్యలతో ట్రంప్ పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేసిన వారికి తన మద్దతు ఉందన్న విషయాన్ని ఒబామా స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.
మేం ఆఫ్రికన్ అమెరికన్లం.. దేశ భక్తులం.. చేతగానివారిలా కూర్చోవటాన్ని నిరసిస్తాం అన్న శీర్షిక మీద ట్రంప్ నిర్ణయాల మీద ఒబామా పాలనా వర్గానికి చెందిన 148 మంది సభ్యులు తప్పు పడుతూ వ్యాసం రాశారు. అందులో ట్రంప్ పాలనలోని ఆయన టీం సభ్యుల వ్యవహారశైలితోపాటు.. ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర విగాతం కలిగించేలా ఉందని పేర్కొన్న తీరును వారు తప్పు పట్టారు. తమ మూలాల ఆధారంగా సొంత దేశంగా భావిస్తున్న అమెరికాను వదిలి వెళ్లిపోమ్మని ఒక అధ్యక్షుడు వ్యాఖ్యానించటం కంటే దారుణం ఇంకేమీ ఉందన్న ఆవేదనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.