Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బతికే ఉన్నాడు

By:  Tupaki Desk   |   10 Jun 2022 2:08 PM GMT
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బతికే ఉన్నాడు
X
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చనిపోయారంటూ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన కుటుంబం ఖండించింది. ఆయన చనిపోయాడంటూ ఈరోజు సాయంత్రం నుంచి పాకిస్తాన్ మీడియా చానెల్స్ హోరెత్తించాయి. అయితే ఆ తర్వాత క్రాస్ చెక్ చేసుకొని వార్త ప్రసారాలను ఆపేశాయి.

ముషారఫ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను దుబాయ్ లోని ఓ అమెరికన్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడని కుటుంబం తెలిపింది.

అయితే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన చనిపోయాడంటూ కుటుంబం ప్రచారం చేసింది. కానీ ఆయన బతికే ఉన్నారని పాకిస్తానీ జర్నలిస్టులు పోస్టులు పెట్టారు. ఈ గందరగోళం నడుమ ముషారఫ్ కుటుంబ సభ్యులు కూడా దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. వెంటిలేటర్ మీద లేరని స్పష్టం చేశారు.

దేశ విభజనకు ముందు ముషారఫ్ 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించాడు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబంతో కలిసి పాకిస్తాన్ వెళ్లిపోయారు. ఆ తర్వాత సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. అనంతరం దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008 వరకూ పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అభిశంసనను తప్పించుకునేందుకు తన పదవికి రాజీనామా చేశారు.

పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన ముషారఫ్ 1999లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత పాక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 2016 నుంచి ఆయన దుబాయ్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ ప్రధాన కారకుడు.