Begin typing your search above and press return to search.

3 నెలల్లో కేసీఆర్ పదవి ఇవ్వకుంటే పార్టీ నుంచి జంపేనట

By:  Tupaki Desk   |   11 Feb 2020 5:30 PM GMT
3 నెలల్లో కేసీఆర్ పదవి ఇవ్వకుంటే పార్టీ నుంచి జంపేనట
X
ఇప్పుడు రాజకీయమంతా పదవుల చుట్టూనే తిరుగుతోంది. పవర్.. పదవి ఈ రెండింటిలో ఏది లేకున్నా.. తామున్న పార్టీ నుంచి వేరే పార్టీలోకి జంప్ అయ్యేందుకు ఏ మాత్రం ఆలోచించని నేతల తీరు ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ గూటికి పలువురు కాంగ్రెస్ నేతలు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

తెలంగాణలో కేసీఆర్ కు తిరుగే లేదన్న విషయంపై క్లారిటీ వస్తున్న కొద్దీ కాంగ్రెస్ నుంచి.. టీడీపీ నుంచి వలసలు పెరగటమే కాదు.. ఇప్పుడా రెండు పార్టీల్లోనూ చాలామంది నేతలు గులాబీ పార్టీలోకి చేరిపోయారు. అయితే.. అలా చేరిన వారిలో ప్రముఖ నేతలు పలువురికి పలు ప్రామిస్ లు చేసి పార్టీలోకి వెల్ కం చెప్పారు. పార్టీలో చేర్చుకునేటప్పుడు ఉండే ఉత్సాహం.. వారికిచ్చిన హామీల్ని అమలు చేసే విషయానికి వస్తే మాత్రం అంత యాక్టివ్ గా లేరన్న మాట వినిపిస్తోంది. దీంతో పలువురు నేతలు సరైన సమయం కూడా ఎదురుచూస్తున్నారని.. అధినేత కేసీఆర్ పట్ల చాలా గుర్రుగా ఉన్నారని చెబుతారు.

తాజాగా ఆ కోవలోకే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా వ్యవహరించటమే కాదు.. రోటీన్ రాజకీయ నాయకుడి తీరుకు ఆయన భిన్నంగా ఉంటారని చెబుతారు. అలాంటి ఆయనకు అయితే ఎంపీ లేదంటే ఎమ్మెల్సీ పదవిని ఇస్తానన్న ప్రామిస్ చేసి పార్టీలోకి తీసుకొచ్చారని చెబుతారు. టీఆర్ఎస్ లోకి చేరిన తర్వాత ఆయన్ను పెద్దగా పట్టించుకున్నది లేదు. దీనికి తోడు ఆ మధ్యన జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కవిత ఓటమి కూడా ఆయనకు పదవిని ఇచ్చే అవకాశాన్ని క్లోజ్ చేసిందని చెబుతున్నారు.

కవిత గెలుపులో సురేశ్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తారన్న కేసీఆర్ అంచనాలకు భిన్నంగా తుది ఫలితం వెలువడటంతో ఆయన్ను పట్టించుకోవటం మానేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. నిజామాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయటానికి వీలుగా సురేశ్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఎంపీ అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

తనకు ప్రామిస్ చేసినట్లు గా మూడు నెలల్లో కేసీఆర్ పదవి ఇవ్వకుంటే తాను కాషాయం కండువా కప్పుకుంటానని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సారువారిని అడగాలే కానీ ఆర్డర్ వేసినట్లు గా అస్సలు ఉండకూడదు.అలాంటిది తనకు మూడు నెలల్లో పదవి ఇవ్వకపోతే పార్టీ మారేయాలన్న ఆలోచనకు సురేశ్ రెడ్డి వచ్చినట్లు గా జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పకతప్పదు.