Begin typing your search above and press return to search.
తల్లీతో రొమాన్స్.. కూతురిపై గ్యాంగ్ రేప్.. తమిళ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు వెలుగులోకి
By: Tupaki Desk | 25 Sep 2020 4:00 AM GMTఆయన ఒకప్పటి ప్రజాప్రతినిధి.. ప్రజాసేవచేసి చేసి బోర్ కొట్టిందేమో జల్సాలకు అలవాటు పడ్డాడు. ఓ పెళ్లైన మహిళను ట్రాప్‌చేసి ఆమెతో రొమాన్స్చేశాడు. ఇది చాలదన్నట్టు ఆమె కూతురుపైనా మనసుపడ్డాడు. తన స్నేహితులతో కలిసి ప్రియురాలి 15 ఏళ్ల కూతురుపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. ఏకంగా ప్రియురాలి కూతురును ఓ గెస్ట్‌హౌస్‌లో బంధించి సంవత్సరంపాటు చెరబట్టి రేప్‌చేశాడు. బాలిక ఎలాగోలా తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో ఈ మాజీ ఎమ్మెల్యే భాగోతం బయటపడింది.
ఇలాగే సంవత్సరం గడిచిపోయింది. ఈ లోపు ఆ బాలికకు ఫామ్‌హౌస్ సమీపంలోని ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ యువకుడితో కలిసి ఫామ్‌హౌస్ నుంచి పారిపోయింది. అయితే తల్లి మాత్రం ఈ మాజీ ఎమ్మెల్యే కలిసి తన కూతురును ఓ యువకుడు కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గాలించగా.. సదరు బాలిక.. ఆ యువకుడితో పోలీసులకు పట్టుబడింది. అయితే బాలిక పోలీసులకు విషయం మొత్తం చెప్పింది. పోలీసులు తొలుత కేసుపెట్టేందుకు వెనకాడినప్పటికీ.. చివరకు మీడియా, ప్రజాసంఘాల ఒత్తిడితో కేసుపెట్టారు. ప్రస్తుతం ఆ మాజీ ఎమ్మెల్యేలను సొంత పార్టీ సస్పెండ్ చేసింది.అయితే సదరు మహిళను, మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.