Begin typing your search above and press return to search.
టీడీపీలో విషాదం..ఏలూరు మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం
By: Tupaki Desk | 26 Dec 2019 7:35 AM GMTతెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే - సీనియర్ నేత బడేటి కోట రామారావు (అలియాస్ బుజ్జి) తుదిశ్వాస విడిచారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత బుజ్జికి గుండెపోటు రావడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. బడేటి బుజ్జి గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా - వైస్ ఛైర్మన్ గా పనిచేశారు. తర్వాత 2009లో ప్రజారాజ్యంలో చేరి - ఆ పార్టీ తరపున ఏలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరి 2014లో ఏలూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయాన్ని సాధించారు. గత ఎన్నికల్లో తిరిగి అక్కడ నుంచే పోటీ చేసిన ఆయన 4072ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని చేతిలో ఓడారు. ఇకపోతే మరో విషయం ఏమిటంటే .. బడేటి బుజ్జి దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావు మేనల్లుడు.
ఆయన మరణవార్త తెలుసుకొని టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు. బుజ్జి మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు - నేతలు సంతాపాన్ని తెలియజేశారు. బాబు బుజ్జి కుటుంబ సభ్యుల్ని ఫోన్ లో పరామర్శించారు. తన సానుభూతిని తెలియజేశారు.
ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ గా - శాసనసభ్యునిగా ఏలూరు అభివృద్ధికి కృషి చేశారని - ఏలూరును స్మార్ట్ సిటీగా చేయాలని పరితపించారని బుజ్జి మృతి ఏలూరు నియోజకవర్గానికే కాదు, టీడీపీకి తీరని లోటన్నారు. బుజ్జి మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని.. ఏలూరు ప్రాంత అభివృద్ధి కోసం పరితపించారన్నారు. బుజ్జి ప్రజల మనిషని.. బుజ్జి మృతి పార్టీకి తీరని లోటని.. తన సంతపాన్ని తెలియజేశారు.