Begin typing your search above and press return to search.
సొంత జిల్లాలో బాబుకు షాక్... ఆ మాజీ వైసీపీలోకి జంప్!
By: Tupaki Desk | 9 Dec 2022 2:30 AM GMTఏపీ రాజకీయాల్లో వైసీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. పనిలో పనిగా మొట్టమొదట టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన సొంతజిల్లాల్లోనే ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లా టీడీపీలో చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు, విధేయుడిగా ఉంటూ, పీలేరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బద్ద శత్రువుగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి అనూహ్యంగా పార్టీ మారారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఆయన బద్ధశత్రువు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా జీవీ శ్రీనాథరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా సీఎం వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేర్చుకునేలా వ్యవహరించారు.
జీవీ శ్రీనాథరెడ్డి పార్టీ మార్పుతో చిత్తూరు జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లే. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచీ పీలేరులో జీవీ శ్రీనాథరెడ్డి కుటుంబం టీడీపీకి ఒక బలమైన కుంటుంబంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గం రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షించేది.
అక్కడ ప్రస్తుతం వైసీపలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జీవీ శ్రీనాథరెడ్డి కుటుంబాల మధ్యే రాజకీయ వైరం కొనసాగేది. అక్కడ జనం కూడా అటు పెద్దిరెడ్డి వర్గం లేదా ఇటు జీవీ శ్రీనాథరెడ్డి వర్గంగా విడిపోయేవారు. ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ కొనసాగేది. అలాంటి జీవీ శ్రీనాథరెడ్డి ఇప్పుడు టీడీపీని వీడి వైసీపీలో చేరడం టీడీపీ శ్రేణులకు విస్తుగొలిపేలా చేసింది.
జీవీ శ్రీనాథరెడ్డి చేరికకు ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌రెడ్డిగా భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో వాయల్పాడు నియోజకవర్గం ఎగిరిపోయి పీలేరు నియోజకవర్గం నిలిచింది. పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచీ గెలుపొందారు. పీలేరు నుంచీ చింతల రామచంద్రారెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు పీలేరు రాజకీయాల్లోకి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌రెడ్డి ప్రవేశించారు. గత ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా టీడీపీ టికెట్ ఆయనకే ఖాయంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో టీడీపీలో ఇక జీవీ శ్రీనాథరెడ్డికి రాజకీయంగా ద్వారాలు మూసుకుపోయినట్లైంది. దాంతో వైసీపీ నేతలు జీవీ శ్రీనాథరెడ్డిని వైసీపీలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనే తెరవెనుక పెద్ద స్థాయిలో మంతనాలు నడిపారు. అయితే జీవీ శ్రీనాథరెడ్డి వేచి చూసే ధోరణి అవలంభించారు. ఇక ఇప్పుడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు జీవీ శ్రీనాథరెడ్డి కుటుంబాన్ని పెద్ద పట్టించుకోకపోవడం, ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన మనసు మార్చుకున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం కూడా జీవీ శ్రీనాథరెడ్డి కుటుంబంతో రాజకీయ వైరాన్ని వీడి స్నేహ హస్తం చాచింది. పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వైసీపీ నేతలు భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలో ఆయన మనసు మార్చుకుని వైసీపీ కండువా కప్పుకొన్నారు. జీవీ శ్రీనాథరెడ్డి పార్టీ మార్పు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పీలేరు నియోజకవర్గంలో రాజకీయపరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.