Begin typing your search above and press return to search.

నాపై పెడుతారు.. నా బామ్మర్ధిపై పెట్టరు.. ఏం న్యాయం: జేసీ

By:  Tupaki Desk   |   20 Jan 2021 12:30 PM GMT
నాపై పెడుతారు.. నా బామ్మర్ధిపై పెట్టరు.. ఏం న్యాయం: జేసీ
X
వరుస కేసులు.. జైలు పాలు కావడం.. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో గొడవలు పెట్టుకొని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అష్టకష్టాలు పడుతున్నాడు. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యేతో ఆయన గొడవ ఇటీవల తారాస్థాయికి చేరింది.

తాజాగా అనంతపురంలో మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ని ఉద్దేశించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్వయానా నా భార్య సోదరుడు, బామ్మర్ధి ప్రసన్నకుమార్ రెడ్డి మూడు సార్లు జిల్లా ఎస్పీని దూషిస్తే కేసుల్లేవని.. నేను ఏమన్నా కేసులు పెడుతున్నారని.. నాకే బాధేస్తోందని జేసీ ప్రభాకర్ రెడ్డి వాపోయారు. నేను కడప జైలు నుంచి వస్తుంటే నేనేం అనకపోయినా పోలీసు అసోసియేషన్ స్పందిస్తోందని.. కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపించారని అన్నారు.

రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఇంత దారుణందని ఉందని జేసీ వాపోయారు. ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో ‘నాకో న్యాయం.. నా బావమరిదికో న్యాయమా?’ అని ప్రశ్నించారు. జెండా ఒక్కటే తేడా అని.. నాది పచ్చది (టీడీపీ,), వాళ్లది ‘బ్లూ కలర్ (వైసీపీ)ది అని అన్నారు.

నాపై కేసుల వెనుక సజ్జల ఉన్నారని.. ఎన్ని రోజులు సజ్జల చేతుల్లో ఉంటాని జేసీ ప్రశ్నించారు. సజ్జల ఏమైనా ఐఏఎస్ ఆఫీసరా అని ప్రశ్నించారు. సాక్షిలో కథలు రాసుకునే వాడని ఎద్దేవా చేశాడు. పోలీసులను ఈయన ఆదేశిస్తే మీరు ఐఏఎస్, ఐపీఎస్ లుగా అవసరమా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కష్టపడి చదివి ఐఏఎస్ శిక్షణ తీసుకున్న మీ పరిస్థితి దారుణంగా ఉందని పోలీసులకు జేసీ హితవు పలికారు. పోలీస్ అసోసియేషన్ లో ఒక్కొక్కరికి ఒక్కో రూలా అని ప్రశ్నించారు.