Begin typing your search above and press return to search.
వెంటిలేటర్ పై చిత్తూరు మాజీ ఎంపీ..చెన్నైకి బాబు
By: Tupaki Desk | 20 Sep 2019 9:57 AM GMTతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు , చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్యపరిస్థితి సీరియస్ గా ఉంది. ఆయన ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన శివప్రసాద్ ను కుటుంబ సభ్యులు ఇటీవలే చెన్నైకి తరలించారు.
అయితే 24 గంటలు అవుతున్నా ఆయన ఆరోగ్య పరిస్థితి కుదటపడలేదు. అంపశయ్యపై ఉన్న ఆయనను పరామర్శించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చెన్నైకి బయలు దేరారు.
2009 - 14లో చిత్తూరు ఎంపీగా గెలిచిన శివప్రసాద్ తనదైన ముద్ర వేశారు. పార్లమెంట్ లో వివిధ వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. సమైక్య ఆంధ్రా ఉద్యమం, ఆ తర్వాత టీడీపీకి అన్యాయాలపై పార్లమెంట్ లోనే సినిమా వేశాలు వేస్తూ మీడియాల్లో పతాక శీర్షిక అయ్యారు.
కాగా కొద్దిరోజులుగా శివప్రసాద్ మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. రెండు వారాల పాటు చెన్నైలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే డిశ్చార్జి అయిన శివప్రసాద్ కు మరోసారి మూత్రపిండాల్లో సమస్యలు తలెత్తినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను గురువారం ఉదయం చెన్నైకి తీసుకెళ్లి అత్యవసర చికిత్స విభాగంలో చేర్చారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
చంద్రబాబుకు బాగా సన్నిహితుడైన శివప్రసాద్ ఆయన ప్రోద్బలంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. చిత్తూరు ఎంపీగా రెండు సార్లు గెలిచి తనదైన ముద్ర వేశారు. మొన్నటి ఎన్నికల్లో చిత్తూరు ఎంపీగా ఓడిపోయారు.