Begin typing your search above and press return to search.
బాబుకు షాక్..జనసేన గూటికి ఆ ప్రముఖుడు
By: Tupaki Desk | 20 Sep 2018 4:13 PM GMTఅధికార తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌పై ఆ పార్టీ నేతల్లోనే విశ్వాసం సన్నగిల్లిందా? రాబోయే ఎన్నికల్లో పార్టీ బలపడే అవకాశం లేదని నేతలు భావిస్తున్నారా? అందుకే నేతలు తమదారి తాము చూసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవలి కాంలో టీడీపీకి క్షేత్రస్థాయిలో బలం తగ్గుతోందనే వార్తలను పరిగణనలోకి తీసుకుంటూ పలువురు నేతలు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ గూటికి, మరికొందరు జనసేన పార్టీ వైపు మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. అలాగే మరో నేతల కూడా పార్టీకి చేరనున్నారు. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో కావడం గమనార్హం.
విశ్లేషకుల అంచనాల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే పక్కదారి పడుతున్నారు. తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని పేర్కొంటూ టీటీడీ మాజీ చైర్మన్ - మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. త్వరలో ఇచప జనసేన పార్టీలో చేరనున్నారని సమాచారరం. హైద్రాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్‌తో చదలవాడ సమావేశం అవడం ఇందుకు ఊతమిస్తోంది. రాబోయే విజయదశమినాడు చదలవాడ జనసేనలో చేరనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
చదలవాడ కృష్ణమూర్తి బలిజ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. తిరుపతి విజయాన్ని ప్రభావితం చేసే స్థాయిలో బలిజ ఓటర్లు ఉన్నప్పటికీ..రాబోయే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ఖచ్చితమైన హామీ ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆయన వైసీపీని ఆశ్రయించినప్పటికీ...అక్కడా నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన వైపు చదలవాడ మొగ్గు చూపినట్లు సమాచారం.