Begin typing your search above and press return to search.

క్లింటన్ పాడుపనిని చెప్పిన జర్నలిస్టు

By:  Tupaki Desk   |   21 Oct 2016 5:39 AM GMT
క్లింటన్ పాడుపనిని చెప్పిన జర్నలిస్టు
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సాగుతున్న ఆరోపణల పర్వం రోజురోజుకీ మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పటికే బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి ఎన్నోఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. హిల్లరీపై ఈమొయిల్ కుంభకోణం ఆరోపణలు రావటం.. అందుకు ఆమె సారీ చెప్పటంతో హిల్లరీ తప్పు చేసిన విషయం స్పష్టమైనట్లే. ఇదిలా ఉంటే.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల పర్వం ఎన్నికల ప్రచారాన్ని మరింత వేడెక్కేలా చేసింది. మహిళల పట్ల చులకనగా మాట్లాడే ఇమేజ్ ఉన్న ట్రంప్ మాటలే కాదు.. గలీజు పనులు కూడా ఎక్కువనే విషయాన్ని స్పష్టం చేస్తూ పలువురు బయటకు రావటం.. ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వటం తెలిసిందే.

దీంతో.. ఇరుకున పడిన ట్రంప్ వర్గం.. తాజాగా ఎదురుదాడికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న హిల్లరీ వర్గానికి షాకిచ్చేలా రిపబ్లికన్లు తాజాగా ఒక కొత్త ఆరోపణను తెరపైకి తీసుకొచ్చారు.1980లలో అర్కన్ సాస్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నవేళ.. బిల్ క్లింటన్ తనను మూడుసార్లు లైంగికంగా వేధించినట్లుగా ఒక మాజీ జర్నలిస్ట్ ఘాటు ఆరోపణలు చేశారు.

అప్పట్లో తాను క్లింటన్ ను దాదాపు 20 సార్లు కలిశానని.. ఇంటర్వ్యూ కోసం ఆయన్ను కలిసినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. మూడు సార్లు ఆయన తనను వేధించినట్లుగా సదరు మాజీ విలేకరి ఆరోపణలు చేసింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇంటర్వ్యూ కోసం వచ్చిన క్లింటన్ తనపై టీవీ స్టేషన్ లోనే లైంగికంగా వేధించినట్లుగా ఆమె పేర్కొన్నారు.

ఈ ఆరోపణలకు చెందిన వీడియోను రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు చెందిన వెబ్ సైట్ లో పోస్ట్ చేయటం గమనార్హం. టీవీ స్టేషన్లోనే క్లింటన్ అంత దారుణానికి పాల్పడినప్పుడు అర్కన్ సాన్ ఎందుకు మౌనంగా ఉన్నట్లు..? ఇప్పటి వరకూ ఎందుకు ఫిర్యాదు చేయనట్లు? టీవీ స్టేషన్లో జరిగిన ఈ ఉదంతంపై సదరు టీవీ స్టేషన్ వారి సమాధానం ఏమిటి? లాంటి పశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉందని రిపబ్లికన్లు చెబుతున్నారు. ఏది ఏమైనా క్లింటన్ చేసినట్లుగా ఆరోపిస్తున్న పాడు పని ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తుందనటంలో సందేహం లేదనే చెప్పాలి.