Begin typing your search above and press return to search.
2024లో ఏపీలో కాపు ముఖ్యమంత్రి: కేంద్ర మాజీ మంత్రి హాట్ కామెంట్స్!
By: Tupaki Desk | 4 Jan 2023 2:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని.. ఆ పార్టీ అధికారంలోకి రాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్ కు కాపు కులం నుంచి ముఖ్యమంత్రి వస్తారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలిపారు.
చంద్రబాబు తెలంగాణలో సభ పెడితే, కేసీఆర్ ఆంధ్రాలో సభ పెడుతున్నారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు సభలు, రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించకుండా జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ మాదిరిగా ఇప్పుడు కేసీఆర్ కు కూడా ప్రధానమంత్రి కావాలని ఆశ ఉన్నట్టు ఉందన్నారు. ఏపీలో బీఆర్‌ఎస్ ఎంట్రీకి ఇద్దరు చంద్రుల మధ్య వివాదమే కారణమన్నారు.
వైసీపీ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పతనం ఖాయమని చెప్పారు. తాను ప్రతి గుడిస గుడిస తిరిగానని.. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు తిడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్ పార్టీ తమను మోసం చేసిందని ప్రజలు భావిస్తున్నారన్నారు. పేద ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని.. వైసీపీని సాగనంపడానికి వారంతా ఎదురుచూస్తున్నారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. తిట్లను కూడా దీవెనలుగా తీసుకుంటే జగన్ ప్రభుత్వానికి మంచి జరుగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చింతా మోహన్ జోస్యం చెప్పారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉంటుందన్నారు. కాపులంతా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని.. కాపులను ముఖ్యమంత్రిని చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితిని తాము 18 ఏళ్ల క్రితమే ఊహించానన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి 2004లోనే లేఖ రాశానని గుర్తు చేశారు.
చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూస్తే పేదల పరిస్థితి అర్థం అవుతుందన్నారు. రూ.1,500 విలువ చేసే సరుకులను 3,500 మందికి ఇస్తామంటే వేల మంది తరలివచ్చారని చింతా మోహన్ గుర్తు చేశారు.
కాగా చింతా మోహన్ తిరుపతి నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు. 1984, 1989, 1991ల్లో టీడీపీ తరఫున ఎంపీగా విజయం సాధించారు. ఇక 1998, 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నేతలు వివిధ పార్టీల్లో చేరిపోయినా చింతా మోహన్ మాత్రం పార్టీ వీడలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.