Begin typing your search above and press return to search.

2024లో ఏపీ సీఎం ఆ సామాజికవర్గం నేతే: కేంద్రమాజీ మంత్రి సంచలనం

By:  Tupaki Desk   |   23 Oct 2021 1:30 PM GMT
2024లో ఏపీ సీఎం ఆ సామాజికవర్గం నేతే: కేంద్రమాజీ మంత్రి సంచలనం
X
2024లో ఏపీకి ఆ సామాజికవర్గం నేతనే సీఎం కావడం ఖాయమని కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రాన్ని ఒక వర్గం 50 ఏళ్లు , మరో వర్గం 25 ఏళ్లు పరిపాలించాయన్నారు. కాపులకు మూడు నాలుగేళ్లు పరిపాలించే అవకాశం ఇవ్వాలన్నారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి కాపులను సీఎం చేయాలనేది తన అభిప్రాయమని.. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని తాను ఒప్పిస్తానన్నారు.వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తం సీఎం కావడం ఖాయమన్నారు.

నేతల తిట్లతో ఏపీ భ్రష్టు పట్టిపోతోందని చింతా మోహన్ అన్నారు.. నేతల తిట్లు చూస్తే స్థాయి పడిపోయిందా? అనిపిస్తుందని.. ముఖ్యమంత్రి వాడే భాష, టీడీపీ నేత వాడిన పదం కూడా బాగాలేదన్నారు. బూతుల విషయంలో టీడీపీ, వైసీపీలది ఇద్దరిదీ తప్పేనన్నారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయని.. ఈ రెండు పార్టీలు కుర్చీ కోసం మ్యూజికల్ చైర్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఎస్సీ, కార్పొరేషన్ల నిధులను దారి మళ్లిస్తున్నారని చింతా మోహన్ ఆరోపించారు. ఏపీలో రెండేళ్లుగా 80 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ రాలేదన్నారు.

దేశంలో పరిస్థితులు బాగాలేవని చింతా మోహన్ అన్నారు. నిరుద్యోగం ధరలు పెరిగాయన్నారు. ఇండో చైనా సరిహద్దుల్లో ఆందోళనగా ఉందని.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదన్నారు.

ప్రధాని మోదీ, బీజేపీలు దేశాన్ని అమ్మేస్తున్నాయని.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మారని... విజయవాడ రైల్వేస్టేషన్ ను అమ్మబోతున్నారని మండిపడ్డారు. మొత్తంగా చాలా రోజుల తర్వాత స్పందించిన కేంద్రమాజీ మంత్రి కాపులు సీఎం కావాల్సిన ఆవశ్యకతను మరోసారి నొక్కి చెప్పారు.