Begin typing your search above and press return to search.
ఏపీలో 2024లో రెండు పార్టీల మధ్యే పోటీ.. కేంద్ర మాజీ మంత్రి హాట్ కామెంట్స్!
By: Tupaki Desk | 10 Nov 2022 9:30 AM GMTవచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ అసలు పోటీలోనే ఉండదని తేల్చిచెప్పారు.
చింతా మోహన్.. తిరుపతి నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇందులో 1984, 1989, 1991ల్లో టీడీపీ తరఫున, 1998, 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు.
2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు వివిధ పార్టీల్లో చేరిపోయినా చింతా మోహన్ మాత్రం పార్టీని వీడలేదు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో ఎన్నికల సమయానికి రాజకీయ పరిణామాలు మారతాయని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పోటీ టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్యే ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. జగన్ ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలు ఎత్తేసి ద్రోహం చేస్తోందని చింతా మోహన్ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు ఆంధ్రప్రదేశ్‌లో తుడిచిపెట్టుకుపోతాయని జోస్యం చెప్పారు.
సామాజిక స్పృహ లేని ముఖ్యమంత్రి జగన్ అని మండిపడ్డారు. సామాజిక సమతుల్యతను ఆయన దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ఉన్నత పదవుల్లో జగన్ సామాజికవర్గానికే పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
ఏ మొహం పెట్టుకుని తిరుపతిలో దళిత సంఘాల నేతలు సదస్సును జగన్ నిర్వహించారని నిలదీశారు. తిరుమలలో రోజువారీ దర్శనాల విషయంలో పారదర్శకత లోపించిందని చెప్పారు. ప్రతి రోజు ప్రోటోకాల్ దర్శనాలను ఎవరెవరికిస్తున్నారో.. ఎన్ని ఇస్తున్నారో బహిర్గతం చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. టీటీడీకి చిత్తుశుద్ధి ఉంటే ఈ పనిచేయాలని కోరారు.
చిన్నాభిన్నం అవుతున్న దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఏకం చేస్తుందని చింతా మోహన్ చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన నోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని చింతా మోహన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.