Begin typing your search above and press return to search.
కేంద్ర మాజీ మంత్రిని టార్గెట్ చేశారా... ?
By: Tupaki Desk | 31 March 2022 3:30 AM GMTఆయన సీనియర్ మోస్ట్ నేత. పైగా రాజకీయ కుటుంబం వారిది. ఆయన తాతల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఒక విధంగా రాజకీయంగా కాకలు తేరిన వంశమది. ఇక అందులో నుంచి వచ్చిన వారు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు. ఆయన యూపీఏ టూ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కీలకమైన రక్షణ శాఖను చూశారు. నిజానికి ఇంతటి ప్రాధాన్యత కలిగిన శాఖ ఏపీలో ఆయనకే దక్కింది అంటే సమర్ధత ఆధారంగానే అని చెప్పాలి.
తనకు అప్పగించిన బాధ్యతలను పల్లం రాజు నూరు పాళ్ళూ న్యాయం చేశారు. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీకే వీర విధేయుడిగా మెలిగారు. విభజన తరువాత ఏపీ కాంగ్రెస్ నుంచి ఎందరో వెళ్ళిపోయినా ఆయన అట్టేపెట్టుకుని ఉన్నారు. అయితే ఆయన ఈ మధ్య ఫుల్ సైలెంట్ అయ్యారు. దేశంలో కూడా కాంగ్రెస్ పరిస్థితి బాగులేకపోవడం, ఏపీలో అయితే అసలే ఉనికి లేకపోవడం ఆయన లాంటి వారిని ఆలోచనలో పడేశాయి అంటున్నారు.
అందుకే ఆయన పీసీసీ చీఫ్ పదవి ఇస్తామని చెప్పినా వద్దని చెప్పేశారు అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని బలమైన సామాజికవర్గానికి చెందిన పల్లం రాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన లోక్ సభకే పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఏ పార్టీ అన్నదే చర్చగా ఉంది.
ఆయన టీడీపీలో చేరుతారు అని ప్రచారం అయితే స్టార్ట్ అయిపోయింది. పల్లం రాజు కోసం టీడీపీ పెద్దలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఆయనను తమ పార్టీలోకి తెచ్చుకుంటే గోదావరి జిల్లాలలో పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారుట. ఇక పల్లం రాజుని కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టడంతో ఆ పరిధిలో సీట్లలో కచ్చితంగా పాగా వేయవచ్చు అని ఆలోచిస్తున్నారుట.
మొత్తానికి పల్లం రాజు కాకినాడ టీడీపీ ఎంపీ క్యాండిడేట్ అన్నది అయితే గట్టిగా వినిపిస్తోంది. మరి ఆయన నిజంగా కాకినాడ నుంచి పోటీ చేస్తారా. టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారా అన్నది అయితే చూడాలి. ఏది ఏమైనా చంద్రబాబు కాంగ్రెస్ లో ఇంకా మిగిలిన సీనియర్ నేతలను టార్గెట్ చేశారని, వారిని కోరి మరీ ఎంపీ అభ్యర్ధులుగా నిలబెట్టి వచ్చే ఎన్నికల్లో గరిష్ట రాజకీయ లాభాన్ని పొందాలని చూస్తున్నారు అంటున్నారు. సో అదే నిజమైతే పల్లం రాజు సైకిలెక్కేసినట్లేనా. వెయిట్ అండ్ సీ.