Begin typing your search above and press return to search.

కేంద్ర మాజీ మంత్రి భార్య దారుణహత్య..ఎవరంటే?

By:  Tupaki Desk   |   7 July 2021 4:46 AM GMT
కేంద్ర మాజీ మంత్రి భార్య దారుణహత్య..ఎవరంటే?
X
భారతదేశం రాజధాని ప్రాంతమైన ఢిల్లీ నగరంలో తీవ్ర విషాదకరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. కేంద్ర మాజీమంత్రి పీ రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టీ కుమారమంగళం దారుణ హత్యకు గురై కన్నుమూశారు. రాజధాని ఢిల్లీలో వీఐపీ జోన్‌ గా పరిగణించే వసంత్ విహార్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు ఆగ్నేయ ఢిల్లీ డీసీపీ తెలిపారు. మరో ఇద్దరి కోసం విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టామని తెలిపారు. హత్యకు గల కారణాలను ఇంకా తెలియరావట్లేదని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని చెప్తున్నారు.

కేంద్ర మాజీమంత్రి పీ రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం (67) దక్షిణ ఢిల్లీలోని వసంత్‌ విహార్ ప్రాంత ఇంట్లో శవమై బుధవారం ఉదయం కనిపించారు. దిండుతో ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కుమారమంగళం జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ లల్లోఎక్కువకాలం పాటు కీలకంగా వ్యవహరించారు. అలాగే , కేంద్ర న్యాయ, విద్యుత్ మంత్రిత్వ శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. 2000లో ఆయన మరణించారు. ఆయన భార్య కిట్టీ కుమారమంగళం ఢిల్లీ వసంత్ విహార్‌ లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సుమారు రాత్రి 9 గంటల సమయంలో ఆమె హత్యకు గురై ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ కోసం వచ్చిన ముగ్గురు దొంగలు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తోన్నామని, అనుమానితులను అదుపులోకి తీసుకుంటోన్నామని అన్నారు. దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చామని, అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తోన్నామని చెప్పారు. ప్రస్తుతం అదుపులో ఒక నిందితుడు ఉన్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని 24 ఏళ్ల రాజుగా గుర్తించారు. రాజు కిట్టి కుమారమంగళం ఇంట్లో దుస్తులు ఉతికే పని చేసేవాడని తెలిపారు. రాత్రి మరో ఇద్దరితో ఇంట్లోకి ప్రవేశించి కిట్టీ కుమారమంగళంపై దాడి చేసి దిండుతో ఊపిరాడకుండా హత్యచేసినట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో రెండు సూట్ కేసులు తెరిచి ఉన్నాయి. కిట్టీ కుమారమంగళం హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

ఇకపోతే , కిట్టీ కుమారమంగళం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తించారు. ఆమె భర్త పీ రంగరాజన్‌ కుమారమంగళం మొట్టమొదట 1984 లో సేలం లోక్‌ సభ నియోజకవర్గానికి కు ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 1991-92 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో 1998లో ఆయన విద్యుత్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె కుమారుడు రంగరాజన్‌ మోహన్‌ కుమారమంగళం కాంగ్రెస్‌ నేత. బెంగళూరులో నివాసం ఉంటున్నారు. తల్లి హత్య వార్త తెలుసుకున్న వెంటనే ఢిల్లీకి బయల్దేరారు.