Begin typing your search above and press return to search.
కాపు సీఎం కి జై...అంటున్నది వైసీపీ మాజీ మంత్రి
By: Tupaki Desk | 27 Dec 2022 4:30 PM GMTరాజకీయాల్లో అభిప్రాయాలను చేంజి చేసుకోవాలి. అలా అవతల వారి డిమాండ్ కి ఇవతల వారు కూడా సరేనంటూ అందిపుచ్చుకుంటేనే అది అసలైన రాజకీయం. ఈ విషయంలో వైసీపీలోని మాజీ మంత్రి పేర్ని అయితే చక్కగా సమయానుకూలంగా స్పందిస్తారు. ఆయనకు మంచి వాగ్దాటి కలిగిన వారు అని పేరు అందుకే.
ఏపీకి కాపు సీఎం అయితే ఓకే అంటున్నారు మాజీ మంత్రి గారు. అయితే దానికి ఆయన ఒక మెలిక పెట్టారు. సమాజాన్ని ప్రేరేపించే వ్యక్తి వచ్చినపుడు రాష్ట్రానికి కాపు వ్యక్తి కూడా సీఎం కావచ్చు అని నాని అంటున్నారు. అంటే నాని దృష్టిలో పవన్ కళ్యాణ్ సమాజాన్ని ప్రేరేపించే వ్యక్తి కారా అన్న డౌట్ వస్తుంది. అయితే దానికి పేర్ని నాని నుంచి జవాబు కూడా ఉంది.
కాపుల ప్రయోజనాలను అన్నీ కూడా పొట్లాం కట్టి చంద్రబాబుకు పవన్ అప్పగిస్తున్నారు అంటున్నారు పేర్ని నాని. కాపులకు సీఎం పదవి కావాలని వారు కోరుతూంటే జనసేన నాయకులు పవన్ సీఎం కావాలని అనుకుంటున్నారని కానీ పవన్ మాత్రం తాను కాకుండా బాబుకు సీఎం పదవి అప్పగిస్తున్నారు అని పేర్ని నాని మండిపడ్డారు.
తనకు సీఎం పదవి వద్దు అని పవన్ అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విషయంలో జనసేన నాయకులు అంతా బాధపడుతున్నారు అని నాని అనడం విశేషం. మరో వైపు అన్ స్టాపబుల్ రియాల్టీ షో మీద కూడా పేర్ని నాని విసుర్లు విసిరారు. నిన్నటిదాకా బావ చంద్రబాబుతో తిరిగారు, ఇపుడు బావమరిది బాలయ్య వద్దకు వెళ్తే తప్పేమీ లేదని పవన్ మీద కామెంట్స్ చేశారు
అది ఒక రియాల్టీ షో అని స్క్రిప్ట్ ముందే రెడీ చేసి పెట్టుకుంటారు కాబట్టి తాము అనుకున్నది చెప్పవచ్చు అని నాని చురకలు అంటించారు. బాలయ్యకు అరవింద్ పుణ్యమాని అహా ఫ్లాట్ ఫారం దొరికిందని, అక్కడ ఆయన తన బావ చంద్రబాబు చేసిన తప్పులను అన్నింటినీ కప్పిపుచ్చుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. ఇక చూస్తే కాపుల రిజర్వేషనల కోసం సీనియర్ నేత హరిరామజోగయ్య దీక్ష చేయడాన్ని తాను స్వాగతిస్తున్నాను అని పేర్ని నాని అనడం విశేషం.
మరో వైపు కమ్యునిస్టులలో కమ్యూనిజం ఉందా అని నాని ప్రశ్నించారు. పేదల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు జగన్ ఇస్తే వారికి ఒక్కసారి అయినా అభినందించారా అని కమ్యూనిస్టులను నిలదీశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వామపక్షాలు మద్దతు ఇస్తున్నారని, నిజమైన కమ్యూనిస్టులు పేదల కోసం పనిచేస్తారని ఆయన సెటైర్లు వేశారు.
చంద్రబాబుని సీఎం చేయడం కోసమే సీపీఐలో నారాయణ రామక్రిష్ణ ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు పక్కన పెట్టడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. అమరావతి విషయంలో 2019 దాకా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ ఏమి అన్నారో ఎంతలా విమర్శించారో గుర్తు తెచ్చుకుంటే మంచిదని పేర్ని నాని అన్నారు. మొత్తానికి అటు పవన్ తో మొదలెట్టి మొత్తం మీద అందరినీ టార్గెట్ చేసి పారేసారు నాని.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.