Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో దూసుకెళ్లిన ఫార్ములా-E కార్లు

By:  Tupaki Desk   |   19 Nov 2022 1:05 PM GMT
హైదరాబాద్ లో దూసుకెళ్లిన ఫార్ములా-E కార్లు
X
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఫార్ములా రేసింగ్ కార్లు దూసుకెళ్లారు. ఇండియాలో మొట్టమొదటి సారిగా హైదరాబాద్ లో ‘ఇండియన్ రేసింగ్ లీగ్’ను ప్రారంభించారు. రేసింగ్ కు ముందు నిర్వహించిన ట్రయల్ రన్ లో స్పోర్ట్స్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాయి.

అనంతరం క్వాలిఫైయింగ్ 1, 2 తర్వాత రేస్ 1 పోటీలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 3.10 నుంచి 3.20 గంటల వరకు క్వాలిఫైయింగ్ , 3.30 నుంచి 3.40 వరకు క్వాలిఫైయింగ్ 2 బీ రేస్ పోటీలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి 4.45 వరకు మెయిన్ రేస్ నిర్వహించారు.

2023 ఫిబ్రవరి 11న జరుగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్ ప్రిపేరేషన్ లో భాగంగా ఇవాళ, రేపు ఇండియన్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ పెట్రోల్ కార్లతోనే రేస్ నిర్వహించారు. ఈ రేసింగ్ లో 12 కార్లు, 6 బృందాలు, నలుగురు డ్రైవర్లు, మహిళా రేసర్లు పాల్గొన్నారు.

50 శాతం దేశంలోని రేసర్లు, మరో 50 శాతం విదేశీ రేసర్లు ఇండియన్ రేసింగ్ లీగ్ లో పాల్గొన్నారు. పెట్రోల్ కార్లు 240 కి.మీ స్పీడ్ తో వెళ్లాయని.. ఎలక్ట్రిక్ కార్లు అయితే గరిష్ట వేగం 320 కి.మీలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ఇక రేసింగ్ ను వీక్షించడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. నిర్వాహకులు కూడా ప్రేక్షకుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 7500 టికెట్లు అమ్ముడుపోయాయని తెలిపారు.

ఈ రేసింగ్ లో మొత్తం 18 మూల మలుపులు ఉన్నాయి. ప్రతి మూలమలుపు వద్ద వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగితే చికిత్స చేయడానికి.. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశారు.

మంత్రి కేటీఆర్ ఐమ్యాక్స్ వద్ద ప్రేక్షకులతోపాటు నిలుచొని రేసింగ్ ను వీక్షించారు. ఈ రేసింగ్ లో హైదరాబాద్, బెంగళూరు, గోవా, చెన్నై, కొచ్చి బృందాలు పాల్గొన్నాయి. ఇక రేసింగ్ సందర్భంగా నెక్లెస్ రోడ్ లో సోమవారం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.