Begin typing your search above and press return to search.
ఐటీ గుట్టు రట్టు.. ఖాయమేనా?
By: Tupaki Desk | 8 Sep 2017 9:59 AM GMTదేశంలో ఐటీ రంగం.. మేడి పండు! పైకి నిగనిగలాడుతూనే లోలోనే అనేక పురుగులు పట్టి ఉంది! అని ఇటీవల ఓ సీనియర్ ఐఐటీయెన్ వెల్లడించిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులు - పనిభారం - వేతన వ్యత్యాసం - ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఉప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి - అన్నింటికీ మించి మానసిక ఒత్తిడి - టార్గెట్లు.. ఇలా ఐటీ రంగంలో అనేక మైన రహస్యాలు దాగి ఉన్నాయి. పైకి కనిపించే లక్షల రూపాయల వేతనం ఒక్కటి తప్ప.. మిగిలినవన్నీ.. లోపాలేనని - తమను వేధించేవేనని ఉద్యోగులు సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు.
ఇక, బెంగళూరు - హైదరాబాద్ లలో అనేక మంది ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలూ వెలుగు చూశాయి. ఇలా.. ఇంతలా.. ఐటీ మాటున అనేక విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా బాహ్య ప్రపంచాన్ని ఎక్కువగా ఆకర్షించే ఈ రంగంలో దాగి ఉన్న ఇలాంటి రహస్యాలను వెల్లడించేస్తామని, గుట్టును రట్టు చేసేస్తామని అంటున్నారు ఐటీ నిపుణుల ఫోరం సభ్యులు. ఐటీ రంగంలో నెలకొన్న సమస్యలపై ఫోరం శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఐటీలో అంతర్గతంగా జరుగుతున్న వివిధ అంశాలను బహిర్గతం చేయనున్నామని ఫోరం ఒక ప్రకటనలో తెలిపింది.
ఐటీలో నెలకొన్న భయంకరమైన వాస్తవాలను బయటి ప్రపంచానికి వెల్లడిచేస్తామని ఫోరం సభ్యులు తెలిపారు. దాదాపు 100 మంది ఐటీ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. హైటెక్ సిటీలోని ఫోనిక్స్ ఎరినాలో సాయంత్రం 4 గంటలకు ఈ ప్రెస్ మీట్ ప్రారంభంకానుంది. ఐటీ ఇండస్ట్రీలో అసత్యాలు - ఉద్యోగుల అక్రమ తొలగింపులు - ప్యాకేజీ చెల్లింపులు తదితర అంశాల గురించి ఐటీ నిపుణులు మాట్లాడనున్నారు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా వేలాది మంది ఐటీ ఉద్యోగుల అక్రమ తొలగింపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ ఫోరం పనిచేస్తోంది. దీంతో ఐటీ గుట్టు రట్టవుతుందని అంటున్నారు విశ్లేషకులు.