Begin typing your search above and press return to search.
కిడారి.. సివేరి హత్యల వెనుక తెలుగు తమ్ముళ్లు?
By: Tupaki Desk | 15 Oct 2018 5:02 AM GMTతీవ్ర సంచలనం సృష్టించిన అరకు ఎమ్మెల్యే కిడారి.. మాజీ ఎమ్మెల్యే సివేరిలను మావోలు మట్టుపెట్టటం వెనుక సంచలన వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ హత్యల వెనుక ఏపీ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న ఆరోపణలను ఏపీ అధికారపక్ష నేతలు వినిపిస్తున్న వేళ.. ఈ హత్యలకు సంబంధించి సంచలన నిజాల్ని బయటపెట్టారు పోలీసులు.
తాజాగా విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు.. మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను మావోలు హత్య చేయటం వెనుక తెలుగు తమ్ముళ్ల సాయం ఉందన్న విస్తవాన్ని వెల్లడించారు. అంతేకాదు.. ఈ హత్యలకు సహకరించిన నలుగురు కీలక నిందితుల్ని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించటం ఇప్పుడు సంచలనంగా మారింది.
తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో టీడీపీ డుంబ్రిగుడ మండల ఉపాధ్యక్షుడు యేడెల సుబ్బారావు-ఈశ్వరి దంపతులు.. గెమ్మిలి శోభన్.. కొర్ర కమలలు కూడా ఈ హత్యల వెనుక కీలక పాత్ర పోషించినట్లుగా చెబుతున్నారు. వీరి సాయంతో కోరాపుట్ డివిజన్ దళం పక్కా వ్యూహంతో దారుణ హత్యల్ని చేసినట్లుగా వెల్లడించారు. ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యేలను మావోలు హతమార్చిన ఉదంతంపై విచారణ జరిపిన పోలీసులు ఉన్నతాధికారులు హత్య జరిగిన పక్క రోజు నుంచి దాదాపు 300 మందిని విచారించిన సిట్.. మావోలకు సహాయ సహకారాలు అందించింది అధికార పార్టీకి చెందిన నేతలనే అన్న విషయాన్ని తేల్చారు. అంతేకాదు.. ఈ ఆపరేషన్లో మావో అగ్రనేతలు చలపతి.. అతని భార్య అరుణలు కీలక పాత్ర పోషించినట్లుగా తేలినట్లు చెప్పారు. దీంతో.. మావోలు హతమార్చిన టీడీపీ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తం ఉందన్న టీడీపీ నేతల ఆరోపణల్లో పస లేదన్నది తేలిందని చెప్పక తప్పదు.