Begin typing your search above and press return to search.

ఖ‌తార్ తో నాలుగు అర‌బ్ దేశాలు క‌టీఫ్‌

By:  Tupaki Desk   |   5 Jun 2017 7:40 AM GMT
ఖ‌తార్ తో నాలుగు అర‌బ్ దేశాలు క‌టీఫ్‌
X
త‌మ దేశాల్ని అస్థిర‌ప‌రుస్తూ.. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల్ని పెంచుతుంద‌న్న ఆరోప‌ణ‌లు పేర్కొంటూ ఖ‌తార్ తో నాలుగు అర‌బ్ దేశాలు క‌టీఫ్ చెప్పిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఖ‌తార్ తో నాలుగు అర‌బ్ దేశాలు తెగ తెంపులు చేసుకున్నాయి. అన్ని ర‌కాల దైత్య సంబంధాలు తెగ‌తెంపులు చేసుకోవ‌ట‌మే కాదు.. ఆ దేశంతో త‌మ‌కున్న స‌రిహ‌ద్దుల్ని కూడా మూసేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు.

తాజా క‌టీఫ్ తో స‌ముద్ర‌.. వాయు మార్గాల్ని కూడా ఖ‌తార్ తో మూసేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఉగ్ర‌వాదం.. వేర్పాటు వాదంతో కొత్త ముప్పు వ‌చ్చి ప‌డుతుంద‌ని.. అందుకే తాము ఖ‌తార్ తో క‌టీఫ్ చెప్పేసిన‌ట్లుగా చెబుతున్నాయి సౌదీ అరేబియా.. ఈజిఫ్ట్‌.. బ‌హ్రేన్‌.. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ఉన్నాయి.

అంతేకాదు..నాలుగు దేశాల్లో ఉన్న‌ ఖ‌తార్ పౌరులంతా ప‌ద్నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో ఆయా దేశాల్ని విడిచి పెట్టి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఉగ్ర‌వాదం.. వేర్పాటువాదుల ముప్పు కార‌ణంగా స‌రిహ‌ద్దుల్ని జాతీయ భ‌ద్ర‌తా ద‌ళాలు ప‌రిర‌క్షించ‌నున్న‌ట్లుగా అధికారులు వెల్ల‌డించారు.

సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు.. ఖ‌తార్ దౌత్య‌వేత్త‌ల్ని కూడా త‌మ దేశాల్ని విడిచి పెట్టి వెళ్లిపోవాల‌ని నాలుగు దేశాలు తేల్చి చెప్పేయ‌టం గ‌మ‌నార్హం. త‌మ దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌టం.. దేశ భ‌ద్ర‌త‌ను అస్థిర‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించ‌టంతోనే ఖ‌తార్ తో త‌మ సంబంధాల్ని తెగ తెంపులు చేసుకున్న‌ట్లుగా నాలుగు దేశాలు వెల్ల‌డించాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/