Begin typing your search above and press return to search.
అహ్మదాబాద్ లో దారుణం: ఒకే అపార్ట్ మెంట్ లో ఆరు మృతదేహాలు
By: Tupaki Desk | 19 Jun 2020 4:59 PM GMTఅలా బయటకు విహారానికి వెళ్తామని చెప్పి వెళ్లిన ఓ కుటుంబం అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడింది. ఏకంగా ఆరుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ అపార్ట్ మెంట్ శవాల దిబ్బగా మారింది. ఈ దారుణ సంఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. విహారానికి అని చెప్పి వెళ్లిన ఆరుగురు కుటుంబసభ్యులు అపార్ట్మెంట్లో ఉరేసుకొని విగత జీవులుగా మారారు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు, వారి నలుగురు పిల్లలు ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ కి చెందిన అన్నదమ్ములు అమ్రిష్ పటేల్ (42), గౌరంక్ పటేల్ వేర్వేరు ప్రాంతాల్లో తమ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. వీరు పిల్లలను తీసుకొని విహారానికి వెళ్తున్నామని జూన్ 17వ తేదీన ఇంట్లో వారికి చెప్పి మొత్తం ఆరుగురు బయటకు వెళ్లారు. బయటకు వెళ్లిన వారంతా 18వ తేదీ రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వారిని గాలిస్తూ వారు ఉంటున్న మరో అపార్ట్మెంట్కి వెళ్లి చూశారు. అయితే అక్కడ లోపల గడియ పెట్టి ఉండడంతో వారు భయాందోళన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా అన్నదమ్ములతో పాటు పిల్లలు విగతజీవులుగా కనిపించారు. దీంతో కుటుంబసభ్యులు షాక్కు గురై కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అన్నదమ్ములిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆహారంలో మత్తు కలిపి పిల్లలకు తినిపించిన వారు మరణించగా వారికి ఉరి వేశారు. ఆ తరువాత వారిద్దరూ కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు ఇంకా తెలుసుకుంటున్నారు. త్వరలోనే మిస్టరీని చేధిస్తామని పోలీసులు తెలిపారు.