Begin typing your search above and press return to search.
ఒకే కాన్పులో నలుగురు పిల్లలు .. తెలంగాణ లో మరో అద్భుతం
By: Tupaki Desk | 28 Oct 2021 11:30 PM GMTశిశువుల జననాలకు సంబంధించి తెలంగాణలో మరో అద్భుతం చోటు చేసుకుంది. ఇటీవల నెలల వ్యవధిలోనే వరంగల్ జిల్లాలో 5 కేజీల బరువుతో ఇద్దరు శిశువులు జన్మించడం, ఆగస్టులో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనివ్వడం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోనూ ఓ తల్లి ఒకే కాన్పులో నలుగురు పిల్లలకి జన్మనిచ్చింది. హైదరాబాద్ సిటీ మెహదీపట్నంలోని మినా ఆస్పత్రి డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోని హఫీజ్ బాబా నగర్ కు చెందిన 27 ఏళ్ల మహిళ మూడోసారి గర్భవతి అయినప్పటి నుంచీ రెగ్యులర్ గా ఆస్పత్రికి వస్తోంది. నెలలు దగ్గరపడుతోన్న కొద్దీ అనూహ్యంగా ఆమెకు బీపీ పెరిగిపోయింది. బీపీ సమస్య తీవ్రంగా ఉండటంతో ఏడో నెల నుంచే ఆస్పత్రిలో చేరిపోయింది.
34వారాలు నిడగా, నిన్న మంగళవారం పురిటినొప్పులు వచ్చాయి. గర్భిణికి బీపీ సమస్య ఉండటంతో మినా ఆస్పత్రి డాక్టర్లు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ నిర్వహించారు. దాదాపు అసాధారణ పరిస్థితిలో ఆపరేషన్ నిర్వహించామని, తల్లికి విపరీతంగా రక్తంపోయిందని, కడుపులో నుంచి మొత్తం నలుగురు పిల్లల్ని బయటికి తీశామని, ఆ తర్వాతగానీ రక్తస్రావాన్ని ఆపగలిగామని డాక్టర్ షుకూర్ తెలిపారు. ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లల్లో ఒకడు అబ్బాయి కాగా, మిగతా ముగ్గురు అమ్మాయిలనీ, వారంతా 1.3 నుంచి 1.5కేజీల బరువున్నారని, ప్రస్తుతనానికి తల్లీ పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.
అరుదైన ఘటనగా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడంతో వారి కుటుంబాలతోపాటు ఆస్పత్రిలోనూ సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈ పిల్లలకి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. అఫ్రీన్ కు గతంలో రెండు నార్మల్ డెలివెరీలు అయ్యాయి.నలుగురు పిల్లలు పుట్టారనే సంతోషం ఒక వైపు ఉన్నప్పటికీ, మా చెల్లికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయోనన్న భయం కూడా ఇంట్లో అందరికి వెంటాడుతోంది అని అఫ్రీన్ అన్న అజీజ్ చెప్పారు. ప్రస్తుతం అఫ్రీన్ భర్త దుబాయ్‌లో పని చేస్తున్నారు. ఆయన ఇంకా ఈ పిల్లల్ని చూడలేదు.