Begin typing your search above and press return to search.
మూడు గదుల్లో నాలుగు డెడ్ బాడీలు.. తెలంగాణలో ఏంటా మిస్టరీ?
By: Tupaki Desk | 17 Jan 2023 7:22 AM GMTఆరోజు ఆమె బ్యాంకుకు రాలేదు.. ఎందుకని ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు.. ఎందుకైనా మంచిదని ఇంటికొచ్చాడు తోటి ఉద్యోగి. తలుపు గడియపెట్టి ఉంది. డోర్ సౌండ్ చేస్తే ఎవరూ తీయలేదు. చుట్టుపక్కల వారిని అడిగితే వారు సమాధానం చెప్పలేదు. కానీ వారు బంధువులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారూ వచ్చారు. మొత్తానికి తలుపులు బద్దలు కొట్టారు.. ఒక్కసారిగా.. అక్కడున్నవాళ్లంతా షాక్..!! ఫ్యాన్ కు వేలాడుతూ ఒక మృతదేహం.. బెడ్ పై మూడు మృతదేహాలు.. వీటిలో ఒకామె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఇలా ఒకే ఇంట్లో నాలుగు డెడ్ బాడీలు.. అంతా ఒకే ఫ్యామిలీకి చెందినవే..? అసలేం జరిగింది..? ఏంటా మిస్టరీ..?
హైదరాబాద్ లోని తార్నాకాలో చోటు చేసుకుందీ ఘటన. ఉస్మానియా యూనివర్సిటీకి అతి సమీపంలో ఉన్న రూపాలీ అపార్ట్ మెంట్ లో లభించిన ఈ మృతదేహలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కానీ ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల కారణంగానే వీరంతా చనిపోయారని అనుమానిస్తున్నారు. ఓ వ్యక్తి తన తల్లి, భార్య, కూతురును హత్య చేసి తాను ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లు నిర్దారణకు వచ్చారు. అసలు ఆ వ్యక్తి వీరిని ఎందుకు చంపాల్సి వచ్చింది.. ఆ తరువాత తాను ఎందుకు చనిపోయాడు..?
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. ప్రతాప్, సింధూరలు భార్యభర్తలు. ఎనిమిదేళ్ల కిందట వీరు వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల ఆద్య అనే కూతురు ఉంది. ప్రతాప్ తల్లి రాజాతీ కూడా ఉంది. చెన్నైకి చెందిన ఈ కుటుంబం సికింద్రాబాద్ లోని తార్నాకలో రూపాలీ అపార్ట్ మెంట్స్ లో ఉంటోంది. ప్రతాప్ చెన్నైలోని బీఎండబ్ల్యూ కార్ షోరూం లో డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య సింధూర హైదరాబాద్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేస్తున్నారు. ప్రతాప్ వీకెండ్స్ లో తార్నాకకు వచ్చి కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇక ఇంట్లో ప్రతాప్ తల్లి రాజాతి కూడా నివసిస్తుంటుంది.
ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు వచ్చిన ప్రతాప్ తన భార్య సింధూరలు కలిసి ఆదివారం బయటకు వెళ్లారు. రాత్రి లేట్ గా ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం సింధూర బ్యాంకుకు రాకపోవడంతో తోటి ఉద్యోగి ఇంటికి రావడం వల్ల ఈ విషయం బయటపడింది. ప్రతాప్ మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతోంది. మిగతా కుటుంబ సభ్యులు బెడ్ రూంలో విగత జీవులుగా ఉన్నారు. దీనిని భట్టి చూస్తే ప్రతాప్ వారిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా తన కుటుంబాన్ని చెన్నైకి తీసుకెళ్లాలని ప్రతాప్ ప్రయత్నిస్తున్నాడు. కానీ సింధూర ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. అందుకే ప్రతాప్ తన కుటుంబ సభ్యులను చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.