Begin typing your search above and press return to search.
నంగనాచిలా మాట్లాడిన ఇమ్రాన్..దీనికేమంటావ్?
By: Tupaki Desk | 28 Sep 2019 4:50 AM GMTఐక్యరాజ్య సమితి జనరల్ బాడీ సమావేశంలో తన మాటలతో పెను సంచలనానికి తెర తీసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీరుపై భారతావనిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నంగనాచి మాటలు మాట్లాడుతూ.. తమకు మించిన పత్తిత్తు మరెవరూ లేరన్నట్లుగా మాట్లాడటమే కాదు.. భారత్ లో ఉగ్రవాదానికి తమకు అసలు లింకే లేదన్నట్లుగా చిలకపలుకులు పలికారు. మోడీ ప్రభుత్వం యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నట్లుగా మాట్లాడి.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
ఇమ్రాన్ ప్రసంగానికి కొన్ని గంటల ముందు పాక్ దుర్బుద్ది బయటపడే మరో పరిణామం పంజాబ్ సరిహద్దుల్లో చోటుచేసుకుంది. డ్రోన్ల ద్వారా భారత్ కు ఆయుధాల్ని తరలించేందుకు పాక్ వేసే దుర్మార్గపు ఎత్తుల్ని పంజాబ్ పోలీసులు గుర్తించారు. పాక్ నుంచి డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులు ఆయుధాల్ని తరలించే పనిని ఈ మధ్యన చేపడుతున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నమే జరిగింది.
పది కేజీల వరకూ బరువుల్ని మోసే డ్రోన్లు ఇటీవల కాలంలో ఏడెనిమిదిసార్లు భారత సరిహద్దుల్లోకి వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన ఒక డ్రోన్ ను పంజాబ్ లోని అట్టారీలోని మహావా గ్రామంలో పోలీసులు గుర్తించారు. కేజెడ్ ఎఫ్ (ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్) ఉగ్రవాద ముఠాకు చెందిన ఆకాశ్ దీప్ ను విచారిస్తున్న వేళ.. పాక్ కు చెందిన ఉగ్రవాద సంస్థ పన్నాగాన్ని అతడు బయటపెట్టాడు.
పాక్ నుంచి ఆయుధాలతో వచ్చిన డ్రోన్ సాంకేతిక సమస్యలతో తిరిగి వెళ్లలేకపోయిందని.. దాన్ని పంట పొలంలో దాచి ఉంచిన వైనాన్ని చెబుతూ.. దాన్ని దాచి పెట్టిన ప్రాంతానికి పోలీసుల్ని తీసుకెళ్లి చూపించాడు. దళానికి చెందిన నలుగురు ఉగ్రవాదుల్ని పంజాబ్ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఐదు ఏకే 47 రైఫిళ్లు.. గ్రెనేడ్లు.. భారీగా మందుగుండు సామాగ్రితో పాటు.. నకిలీ నోట్లు.. అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదం.. ఉగ్రవాద సంస్థలతో తమకెలాంటి సంబంధాలు లేవని చెప్పే ఇమ్రాన్.. ఈ ఉదంతంపై ఏం చెబుతారన్నది ప్రశ్నగా మారింది.